Flipkart Big Billion Days: ఐఫోన్ ఎస్ఈ 2020 ధరలపై భారీ డిస్కౌంట్

Flipkart Big Billion Days 

Last Updated : Oct 16, 2020, 09:07 AM IST
Flipkart Big Billion Days: ఐఫోన్ ఎస్ఈ 2020 ధరలపై భారీ డిస్కౌంట్

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూసిన ఐఫోన్ 12 (iPhone12)ను యాపిల్ కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. ఈ అక్టోబర్ చివరి వారంలో ఐఫోన్ 12 మొబైల్స్ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఐఫోన్ 12 విడుదలతో యాపిల్ కంపెనీ తన ఇతర మోడల్స్ ధరలు (iPhone SE 2020 Price) అమాంతం తగ్గించేసింది. ఇటీవల ఐఫోన్ 11 ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన యాపిల్ కంపెనీ తమ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి Flipkart Big Billion Days sale మరో శుభవార్త అందించింది. 

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ధరలను భారీగా తగ్గించింది. ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ (iPhone SE 2020 Price) ధర రూ.39,999 కాగా, బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999కి విక్రయిస్తున్నారు. ఏకంగా రూ.14000 ధర తగ్గడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా తక్కువ ధరలకు iPhone SE మొబైల్స్ కొనాలంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను వాడుకుంటే రూ.20,000 కన్నా తక్కువ ధరలకు వస్తుంది.

 

ఎస్‌బీఐ కార్డులపై ఆఫర్
రూ.14,000 తగ్గించి iPhone SE 2020 మొబైల్‌ను రూ.25,999కి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. అయితే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు వాడితే ఆ ధర మరింత తగ్గించుకోవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.1,750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే iPhone SE 2020 ధరలో రూ.1,200 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు అక్టోబర్ 16 (నేటి) నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News