ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల.. ఫీచర్స్ అదుర్స్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!

Ola Electric Scooter: ఎదురుచూపులకు తెరపడింది. తొలి విద్యుత్​​ స్కూటర్​ను విడుదల చేసింది ఓలా ఎలక్ట్రిక్​. రెండు వేరియంట్లలో, పది రంగుల్లో ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2021, 04:29 PM IST
  • ఓలా ఈ-స్కూటర్​ రిలీజ్
  • రెండు వేరియంట్లలో లభ్యం
  • సెప్టెంబరు నుంచి అందుబాటులోకి
ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల.. ఫీచర్స్ అదుర్స్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181కి.మీ!

Ola Electric Scooter:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ-స్కూటర్​ను ఆవిష్కరించింది ఓలా​. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఓలా ఎస్1(OLA S1) ప్రారంభ ధర రూ.రూ.99,999 గా, ఓలా ఎస్1 ప్రో(OLA S1 PRO) ధర రూ.1,29,999గా నిర్ణయించారు. ఇది పది రంగుల్లో లభిస్తోంది.  కేంద్రం అందించే సబ్సిడీలతో పలు రాష్ట్రాల్లో ధరల్లో మార్పులుంటాయి. ఇది ఇప్పటికే  ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ ప్రకటించి స్కూటర్‌పై ఆసక్తిని పెంచింది. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (ola electric scooter) ఫీచర్లను, ధరతోపాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో  భవీస్ అగర్వాల్(Bhavees Agarwal) వెల్లడించారు. కేవలం రూ. 499లతో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని అందించడంతో 24 గంటల్లో దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పింది.

Also Read:షావోమీ నుంచి మరో సంచలనం, త్వరలో మార్కెట్‌లో సైబర్ డాగ్ రోబోలు

ఓలా ఎస్1, ఎస్1 ప్రో సిరీస్ సెప్టెంబర్ నుంచి కొను గోలు కోసం అందుబాటులో ఉంటాయి. అయితే షిప్పింగ్ మాత్రం అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్(ola electric scooter)  రివర్స్‌ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎస్1 121 కిలోమీటర్లు, ఎస్1 ప్రో 181 కి.మీల వరకు ప్రయాణిస్తాయి. వీటి​ గరిష్ఠ వేగం గంటకు 115 కిలోమీటర్లు. రెండు వేరియంట్లకు 750 వాట్స్​ పోర్టబుల్ ఛార్జర్ అందించనుంది ఓలా ఎలక్ట్రిక్.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోం డెలివరీ పద్దతిలో కస్టమర్లకు అందించనున్నారు. ఇప్పటికే టెస్లా(Tesla) ఇదే పద్దతిలో తన కార్ల అమ్మకాలు చేపడుతోంది.  తమిళనాడు(Tamilnadu)లో ఉన్న ఓలా మెగా ఫ్యాక్టరీలో స్కూటర్లు​‍ తయారవుతున్నాయి. ప్రారంభ దశలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఏడాదికి కోటి స్కూటర్ల తయారీ లక్క్ష్యంగా ఇక్కడ విస్తరణ పనులు జరుగుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News