New Tax Regime: కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే మీరు కోల్పోయే ట్యాక్స్ డిడక్షన్ మినహాయింపులు ఇవే

New Tax Regime: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. అందుబాటులో ఉన్న రెండు ట్యాక్స్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవల్సి ఉంటుంది. కొత్త ట్యాక్స్ రెజీమ్ ఎంచుకుంటే ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి నష్టముందో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2023, 12:33 PM IST
New Tax Regime: కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే మీరు కోల్పోయే ట్యాక్స్ డిడక్షన్ మినహాయింపులు ఇవే

New Tax Regime: ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ట్యాక్స్ విధానం ఏదనేది తప్పకుండా ఎంచుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్థులు పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవల్సి వస్తుంది. యజమానులు తమ ఉద్యోగులకు ట్యాక్స్ రెజీమ్ ఎంచుకునే అవకాశమివ్వాలి.

ఉద్యోగుల జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నందున ట్యాక్స్ విధానం ఆప్షన్ ఇవ్వకపోతే టీడీఎస్ భారీగా కట్ అయ్యే అవకాశాలున్నాయి. అది టేక్ హోమ్ జీతంపై ప్రభావం చూపిస్తుంది. ఒకే జీతమున్న ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు ట్యాక్స్ విధానాలు ఎంచుకుంటే ఇద్దరి ట్యాక్స్ డిడక్షన్ కూడా తేడా ఉంటుంది. అందుకే ఏ ట్యాక్స్ విధానం ఎంచుకోవాలనేది జాగ్రత్తగా ఆలోచించి వీలైతే ఆడిటర్‌ను సంప్రదించి నిర్ణయించుకోవాలి. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 7 ప్రధాన మినహాయింపులకు దూరమైపోతారు. 

1. సెక్షన్ 80 సి ప్రకారం క్లెయిమ్ చేసుకునే పీపీఎఫ్, ఎన్ఎస్‌సి, యూలిప్, సీనియర్ సిటిజన్ స్కీమ్, ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంటి లోను వంటివి వర్తించవు.

2. సెక్షన్ 80 డి ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిమియంలు వర్తించవు. సాధారణంగా ఇందులో భాగంగా 25 వేల వరకూ మినహాయింపు పొందవచ్చు. 

3. సెక్షన్ 80 ఇ ప్రకారం ఎడ్యుకేషన్ రుణంపై వడ్డీ మినహాయింపు ఉండదు. ఉన్నత చదువుల రుణం, డిడక్షన్ అనేది ఇక వర్తించదు.

4. సెక్షన్ 80 టీటీఏ, 80 టీటీబీ ప్రకారం సేవింగ్ ఎక్కౌంట్ వడ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై మినహాయింపు గతంలో ఉండేది. కొత్త ట్యాక్స్ రెజీమ్ ప్రకారం ఇవి వర్తించవు. ఇందులో గరిష్టంగా 50 వేల మినహాయింపు ఉండేది. 

5. గతంలో ఉన్న ఎల్టీఏ మినహాయింపు ఈసారి ఉండదు. గతంలో సెక్షన్ 10 ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 

6. హెచ్ఆర్ఏ పై గతంలో సెక్షన్ 10 ప్రకారం మినహాయింపు ఉండేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ విదానంలో ఆ అవకాశం లేదు. 

7.  సెక్షన్ 24 బి ప్రకారం ఇంటి రుణం వడ్డీ ట్యాక్స్ మినహాయింపులో ఉండేది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వరకూ వడ్డీ చెల్లింపుపై మినహాయింపు లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 

Also read: PPF Interest Rate: పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు గుడ్‌న్యూస్, మీ నగదుపై రెట్టింపు వడ్డీ, ఎలాగో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News