Rupee Value: జీవకాల కనిష్ఠానికి రూపాయి.. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి?

Rupee Value: డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. ఫోరెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ ఏకంగా 1 శాతానికిపైగా క్షీణించింది. దీనితో మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి దిగజారింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 06:22 PM IST
  • భారీగా పడిపోయిన రూపాయి విలువ
  • జీవనకాల కనిష్ఠానికి పతనం
  • అంతర్జాతీయ భయాలే కారణం
Rupee Value: జీవకాల కనిష్ఠానికి రూపాయి.. ఈ పరిస్థితికి కారణాలు ఏమిటి?

Rupee Value: రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సహా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఫోరెక్స్​ మార్కెట్లో సోమవారం డాలర్​తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. కేవలం ఒక్కరోజే ఒక శాతం కన్నా ఎక్కువగా పతనమవడం గమనార్హం.

ప్రస్తుతం రూపాయి విలువ..

గత కొన్నాళ్లుగా క్రమంగా పతనమవుతూ వస్తున్న రూపాయి విలువ సోమవారం భారీగా పడిపోయింది. ఉదయం 76.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ చివరకు (గత సెషన్​తో పోలిస్తే) 84 పైసలు తగ్గి.. రూ.77.01 వద్ద స్థిరపడింది.

గతవారాంతంలో రూపాయి విలువ 23 పైసలు కోల్పోయి రూ.76.17 వద్ద స్థిరపడింది. 2021 డిసెంబర్ 15 తర్వాత ఈ స్థాయిలో రూపాయి పతనమవడం ఇదే తొలిసారి.

రూపాయి పతనానికి కారణాలు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం, స్టాక్ మార్కెట్ల పతనం, ముడి చమురు ధరల్లో వృద్ధి ఆందోళనలు పెంచుతున్నాయి. చమురు దిగుమతులకోసం అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో రూపాయి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు.

బ్రెంట్ క్రూడ్​ ఆయిల్​ ధర తాజాగా మరో 10 శాతం పెరిగి.. బ్యారెల్​కు 130 డాలర్లకు చేరింది.

రూపాయి విలువ తగ్గితే ఏమవుతుంది?

మనం ఏదైనా దేశంతో లావాదేవీలు జరపాలంటే.. డాలర్ల ద్వారానే చేయాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతులకోసం అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా దిగుమతు చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా ముడిచమురు ఉత్పత్తులైన పెట్రోల్​, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. వీటితో పాటు దిగుమతు చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగుతాయి. ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గే అవకాశముంటుంది.

Also read: Stocks today: వెంటాడిన రష్యా-ఉక్రెయిన్​ భయాలు- రికార్డు స్థాయిలో పతనమైన మార్కెట్లు!

Also read: Cruid Oil Price: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, మరింతగా పెరగనున్న పెట్రోల్ ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News