Cruid Oil Price: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం..ప్రపంచదేశాలపై పడుతోంది. బంగారం, ఆయిల్, నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఇతర దేశాలకు సమస్యగా మారుతోంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగే కొద్దీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలపై పడుతోంది. రష్యా దాడులు, అమెరికా విధించిన ఆంక్షల నేపధ్యంలో ముడి చమురు ధర రెండవ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై పదిరోజులు దాటుతుండటంతో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో కీలక స్థావరాల్ని రష్యా స్వాధీనం చేసుకుంటోంది. అటు నాటో దేశాలు మాత్రం ఆర్ధిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రపంచ ఆయిల్ మార్కెట్‌లో ఒపెక్ దేశాల తరువాత వెనిజులా, రష్యాలదే అగ్రస్థానం. మొత్తం ఉత్పత్తిలో రష్యా పదిశాతం ఆక్రమించింది. ఇప్పటి వరకూ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించలేదు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. నాటో, ఈయూ దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో ఆంక్షలు విధిస్తే సమస్య మరింత జటిలం కానుంది. గతంలో అణ్వాయుధాల కారణంతో అమెరికా ఇరాన్‌పై ఆయిల్ దిగుమతి విషయంలో ఆంక్షలు విధించింది. ఇది అప్పట్లో అమెరికాకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు రష్యాపై ఆయిల్ ఆంక్షలు విధిస్తే అమెరికాకు మరింత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పెట్రోలు దిగుమతి విషయంలో అమెరికా ప్రపంచంలో ప్రధమ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తికి ఒపెక్ దేశాలు సంసిద్ధంగా లేకపోవడం, లిబియాలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముడి చమురు ఉత్పత్తి తగ్గుతోంది. ఇప్పుడు రష్యా యుద్ధంలో మునిగితేలుతోంది. ఫలితంగా చమురు లభ్యత తగ్గిపోయింది. దాంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర తాజాగా 139 డాలర్లకు చేరుకుంది. ఇది రెండవ గరిష్ట ధర. గతంలో అంటే 2008లో బ్యారెల్ ధర 143 డాలర్ల వరకూ వెళ్లింది. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే..ముడి చమురు ధర మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.
Also read: Petrol price hike: రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook