Stocks today: స్టాక్ మార్కెట్లు మరోసారి రికార్డు స్థాయి నష్టాలను మూటగట్టుకున్నాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 1,491 పాయింట్లు (2.74 శాతం) కుప్పకూలి.. 52,842 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 382 పాయింట్లు (2.35 శాతం) నష్టపోయి 15,863 వద్ద కొనసాగుతోంది.
ఉక్రెయిన్ లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందోనన్న భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతుండటం స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణమైనట్లు చెబుతున్నారు విశ్లేషకులు.
సూచీల కదలికలు ఇలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 53,203 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. మిడ్ సెషన్లో నమోదైన అమ్మకాల కారణఁగా 52,367 వద్దకు పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 15,944 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 15,711 వద్దకు చేరింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
30 షేర్ల ఇండెక్స్‌లో కేవలం 5 షేర్లు లాభాలను గడించాయి. మిగతా 25 కంపెనీలు భారీగా పతనమయ్యాయి.
భారతీ ఎయిర్టెల్ 3.98 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.40 శాతం, టాటా స్టీల్ 1.22 శాతం, ఇన్ఫోసిస్ 0.95 శాతం, ఐటీసీ 0.07 శాతం లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ 8.11 శాతం, మారుతీ సుజుకీ 6.52 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.40 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 6.08 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 5.99 శాతం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి విలువ రికార్డు స్థాయిలో 0.80 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.76.96 వద్దకు చేరింది. రూపాయికి ఇది జీవనకాల కనిష్ఠం కావడం గమనార్హం.
Also read: Petrol price hike: రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు?
Also read: Todays Gold Rate: 54 వేలకు చేరుకున్న బంగారం ధర, ఇంకెంత పెరుగుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook