Share Price Boost 87 Percent: ఒక్కప్పుడు ఆ షేర్‌ రూ.5 ఇప్పుడు రూ.2,318..మరింత పెరిగే ఛాన్స్‌?

Share Price Boost 87 Percent: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. 3 సార్లు డివిడెండ్స్‌ ప్రకటించిన ఈ కంపెనీ ఈ సంవత్సరం కూడా పెట్టుబడిదారులకు రూ.10 డివిడెండ్స్‌ అందిస్తోంది. అయితే ఈ షేర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 10:43 AM IST
Share Price Boost 87 Percent: ఒక్కప్పుడు ఆ షేర్‌ రూ.5 ఇప్పుడు రూ.2,318..మరింత పెరిగే ఛాన్స్‌?

 

Share Price Boost 87 Percent: ఒక్కప్పు ఫైనాన్స్ కంపెనీల షేర్లు అతి తక్కువ ధరనే ఫలికేవి..టెక్నాలజీ పెరిగే కొద్ది ప్రరిశ్రమ రంగంలో వస్తున్న మార్పుల కారణంగా ఫైనాన్స్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను కొల్లగొడుతున్నాయి. అంతేకాకుండా మార్కెట్‌లో వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు డివిడెండ్స్‌ను కూడా ప్రకటిస్తున్నాయి.  అయితే ఇటీవలే శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఇన్వెస్టర్లకు భారీ డివిడెండ్‌లను చెల్లిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 23న ఈ కంపెనీ ఇన్వెస్టర్లు రూ.10 వరకు  డివిడెండ్స్‌ను అందచబోతున్నట్ల వెల్లడించింది. 

ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వాటాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 6 నుంచి డివిడెండ్స్‌ను అందించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు రూ.10 అదనంగా పొందుతారు. 

ఇంతకు ముందు 3 సార్లు డివిడెండ్స్‌:
2023 సంవత్సరంలో కూడా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ పెట్టుబడిదారులకు మూడు సార్లు డివిడెండ్‌లు చెల్లించిన సంగతి తెలిసిందే. ఇంతక ముందు కంపెనీ రూ.55 వరకు డివిడెండ్‌లను అందించింది. ఇక 2022లో కూడా భారీ డివిడెండ్‌లు ప్రటించింది. గత సంవత్సరంలో ప్రకటించిన డివిడెండ్స్‌ను దృష్టిలో పెట్టునే ఈ సంవత్సరం కూడా ప్రకటించిన్నట్లు సమాచారం.  

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు మొదట రూ.5తో మార్కెట్‌లో లిస్టింగ్‌ చేశారు. అయితే అప్పటి నుంచి ఏ మాత్రం తగ్గకుండా ఎంతో మెరుపు వేగంతో స్టాక్స్‌ వృద్ధి చెందుతూనే వచ్చాయి. ఇప్పటికి ఈ కంపెనీ షేరు వ్యాల్యూ రూ.46,539 కాగా 84 శాతం వరకు రాబడిని అందించింది. 25 ఏళ్లలో ఈ షేర్ వ్యాల్యూ రూ.2,318 వరకు పెరిగింది. ముఖ్యగా ఈ స్టాక్‌ ఒక నెలల మాత్రం దాదాపు 13 శాతం వరకు రాబడిని అందించిందంటే..ఇక ఈ కంపెనీ గురించి చెప్పనక్కర్లేదు. 6 నెలల్లో 28 శాతం ఇలా ఒక్క సంవత్సరంలోనే 87 శాతానికి దూసుకుపోయింది. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గడిచిన 5 సంవత్సరలలో దాదాపు 127 శాతం రిటర్న్స్ ఇచ్చిందని తెలుస్తోంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News