Annual Recharge Plans: అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్‌లు ఇవే

Annual Recharge Plans: దేశంలోని టెలీకం రంగంలో మూడు ప్రైవేట్ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటోంది. రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ పోటీలో భాగంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 20, 2023, 11:52 AM IST
Annual Recharge Plans: అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాతో అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్‌లు ఇవే

Annual Recharge Plans: మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు, యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ అందుబాటులో తీసుకొస్తున్నాయి. లాంగ్ టెర్మ్ ప్లాన్స్ వల్ల యూజర్లకు చాలా ప్రయోజనాలు కలుగుతుంటాయి. ఈ మూడు కంపెనీలు ప్రవేశపెట్టిన వార్షిక ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 1799 వార్షిక ప్లాన్
 
365 రోజుల వ్యాలిడిటీతో ప్రీ పెయిడ్ ప్లాన్ 1799 రూపాయలు తీసుకోవచ్చు. ఇందులో ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఏడాదికి 3600 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. మొత్తం ఏడాదికి 24 జీబీ ఉంటుంది. ఎస్‌ఎంఎస్‌లు రోజుకు 100 మాత్రమే పంపించుకోవచ్చు. డేటా మాత్రం 24 జీబీని ఏడాదిలో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హెల్లో ట్యూన్స్ , వింక్ మ్యూజిక్ కాంప్లిమెంటరీగా అందుతాయి. ఇందులోనే డేటా ఎక్కువ కావాలంటే ఏడాదికి 2999 రూపాయల ప్లాన్ ఉంది. ఇందులో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 

రిలయన్స్ జియో 2879 రూపాయల ప్లాన్

జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ఇది. ఇది కూడా 365 రోజులు వర్తిస్తుంది. 2879 రూపాయల ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. జియో సినిమా, జియో టివి సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 5 జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జి డేటా ఉంటుంది. అదే 2999 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఏడాదికి 2545 రూపాయలకు మరో ప్లాన్ ఉంది. అయితే ఇది 336 రోజులే వస్తుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా లబిస్తుంది. 

వోడాఫోన్ ఐడియా 1799 రూపాయల ప్లాన్

వోడాఫోన్ ఐడియా ఆఫర్ చేస్తున్న వార్షిక ప్లాన్ ఇది. 365 రోజుల వ్యాలిడిటీ 1799 రూపాయలకు తీసుకోవచ్చు. ఏడాది మొత్తం 24 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్, టీవీ యాప్ అన్నీ ఉచితంగా పొందవచ్చు. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ ఉచితంగా డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ ఉంటుంది. వీకెండ్ డేటా రోలోవర్‌లో భాగంగా ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా అదనంగా 50 జీబీ డేటా ఇస్తోంది.

Also read: Hyundai Creta Without Gst: GST లేకుండా Hyundai Cretaను కొనుగోలు చేయోచ్చు..రూ.1,63,000 వరకు తగ్గింపు కూడా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News