Tips For Car Loans: కొత్త కారు కొంటున్నారా ? కారు లోన్ తీసుకుంటున్నారా ?

Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకుంటున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీ కోసమే. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.

Written by - Pavan | Last Updated : Jul 20, 2023, 03:20 PM IST
Tips For Car Loans: కొత్త కారు కొంటున్నారా ? కారు లోన్ తీసుకుంటున్నారా ?

Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచీతూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. హోమ్ లోన్ తరువాత ఎక్కువ కాలం పాటు చెల్లించే లోన్ ఏవైనా ఉన్నాయా అంటే అవి కార్ లోన్స్ అనే చెప్పుకోవచ్చు. మీ వాహనం ఖరీదు, మీరు చెల్లించిన డౌన్ పేమంట్‌ని బట్టి ఒక్కోసారి మ్యాగ్జిమం ఏడేళ్ల వరకు కూడా మీరు కార్ లోన్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.

కారు లోన్ వడ్డీ రేటు
కారు లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 6.75 శాతం నుంచి గరిష్టంగా 9 శాతం వరకు ఉంటుంది. మీ సిబిల్ స్కోర్, ఆదాయం, లోన్ తిరిగి చెల్లించే గడువు, ఎంపిక చేసుకున్న కారు కేటగిరి లేదా మోడల్, మీరు చెల్లించే డౌన్ పేమెంట్ వగైరా వగైరా మీకు అందించే వడ్డీ రేటును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీకు ఆదాయం బాగుండి సిబిల్ స్కోర్ కూడా బాగుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండి, మీ క్రెడిట్ హిస్టరీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, మీకు వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాన్ని బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్ ని బట్టి 9 శాతం కంటే ఎక్కువ కూడా చార్జ్ చేస్తుంటాయి. 

ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నారు అనేది చెక్ చేయాలి. వడ్డీ రేటు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ కాగా రెండోది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఒకవేళ మీరు లోన్ తీసుకునే సమయంలో మార్కెట్ పరిస్థితి ఒడిదుడుకలకు లోన్ అవుతూ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది అనుకుంటే మీరు ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంపిక చేసుకోవడం బెటర్. 

క్రెడిట్ స్కోర్
కారు లోన్ తీసుకోవాలంటే మీకు కనీసం 750 పాయింట్స్ సిబిల్ స్కోర్ ఉండాలి అనే నిబంధన ఉంది. అంతకంటే ఎంత ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మీకు అంత తక్కువలో వడ్డీ రేటు లభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కారు లోన్‌కి వెళ్లడానికి ముందుగా మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. తగినంత స్కోర్ ఉంది అనుకుంటేనే కారు లోన్ కోసం అప్లై చేసుకోండి. లేదంటే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న కారణంగా మీ కారు లోన్ రిజిక్ట్ అయితే అది మీ క్రెడిట్ హిస్టరీపై నెగటివ్ ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తగినంత స్కోర్ లేదనుకుంటే, ఏమైనా పాత లోన్ బకాయిలు, క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటే అవి చెల్లించి మీ క్రెడిట్ అవసరాలు తగ్గించుకోండి. మీ స్కోర్ మెగురుపడిన తరువాత మళ్లీ కారు లోన్‌కి వెళ్లొచ్చు. 

లోన్ రీపేమెంట్ కాల పరిమితి
ఎక్కువ కాలం పాటు లోన్ రీపేమెంట్ చేసేలా లోన్ టెన్యూర్ ఎంపిక చేసుకుంటే మీకు ఇఎంఐ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువ కాలం పాటు రుణం చెల్లిస్తే.. మీరు చెల్లించే వడ్డీ కూడా ఎక్కువే ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఎక్కువ ఈఎంఐ చెల్లించే స్థితిలో ఉంటే, లోన్ టెన్యూర్ తక్కువగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. తక్కువ లోన్ టెన్యూర్‌తో ఇఎంఐ ఇంకొంత మేర పెరగొచ్చు కానీ.. మీరు అనవసరంగా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తించండి. 

లోన్ ప్రాసెసింగ్ ఫీజు
కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు అందిస్తామని చెప్పి కారు లోన్ ప్రాసెస్‌కి సంబంధించి అవి, ఇవి అంటూ ఎక్కువ మొత్తంలో ఇతర చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఒక్కోసారి అవి ఇతర బ్యాంకులతో పోల్చిచూస్తే చాలా పెద్ద మొత్తంలో తేడా ఉంటుంది. అందుకే తక్కువ వడ్డీ రేటు పేరుతో ఇలాంటి మోసాల బారిన పడకుండా చూసుకోండి. 

రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ / ప్రీ-క్లోజర్ చార్జీలు / ప్రీపేమెంట్ చార్జీలు
మీరు ఎంపిక చేసుకున్న గడువు కంటే ముందే మీరు మీ కారు రుణాన్ని పూర్తిగా చెల్లించాలి అనుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు లేనిపోని కొర్రీలు పెడుతుంటాయి. ఇంకొన్ని బ్యాంకులు ఎక్కువ మొత్తంలో ప్రీ-క్లోజర్ చార్జీలు / ప్రీపేమెంట్ చార్జీలు వసూలు చేస్తుంటాయి. అందుకే ముందే బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఎవరు తక్కువ చార్జీలు వసూలు చేస్తారో వారి వద్దే కారు లోన్ తీసుకోండి.

ఆన్‌లైన్ సర్వీసెస్, లోన్ ప్రాసెసింగ్‌కి తీసుకునే సమయం
కారు లోన్‌కి అప్లై చేశాకా ఆ లోన్ ఎప్పుడు శాంక్షన్ అవుతుంది అని తెలుసుకోండి. కొన్ని బ్యాంకులు మినిమం డాక్యుమెంటేషన్‌తో నిమిషాల వ్యవధిలోనే కారు లోన్ ఇచ్చేస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ అంటూ రోజుల కొద్ది సమయం తీసుకుంటాయి. అందుకే ఏది త్వరగా అవుతుందో చూడండి. అలాగే లోన్ స్టేటస్ చెక్ చేసే అవకాశం ఉందా లేదా కూడా చూడండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. లోన్ తిరిగి చెల్లించే క్రమంలో భవిష్యత్తులో మీకు బ్యాంకు నుంచి ఏదైనా కారు లోన్ రీపేమెంట్ స్టేట్మెంట్ అవసరం అయినా లేదా మీ లోన్ వివరాలు చెక్ చేసుకోవాలనుకున్నా.. ఆ సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తాయో లేదో కనుక్కోండి. లేదంటే ప్రతీసారి మీరు నేరుగా బ్యాంకుకి వెళ్లక తప్పదు. 

లోన్ ఎలిజిబిలిటి, డౌన్ పేమెంట్
కొన్ని బ్యాంకులు 100 శాతం కారు లోన్స్ ఇస్తే.. ఇంకొన్ని బ్యాంకులు మీ నుంచి కొంత మేరకు డౌన్ పేమెంట్ కావాలని ఆశిస్తాయి. అందుకే మీ వద్ద ఉన్న మొత్తాన్ని డౌన్ పేమెంట్ చెల్లిస్తే ఇచ్చే బ్యాంకులు ఏమున్నాయో చెక్ చెసుకోండి. అలా కాకుండా బ్యాంకు ఎక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ అడిగింది కదా అని మళ్లీ మీరు మరో చోట అప్పుగా తీసుకొచ్చి ఏక కాలంలో రెండు చోట్ల అప్పు చెల్లించాలి అంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

ఇది కూడా చదవండి : Safe & Best Cars in India: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సేఫ్టీ కార్లు

కారు కంపెనీకి ఏదైనా బ్యాంకుతో టయ్యప్ ఉందా చెక్ చేయండి
దాదాపు అన్ని కారు కంపెనీలు ఏదో ఒక బ్యాంకుతో టయ్యప్ పెట్టుకుని కారు లోన్స్ అందిస్తున్నాయి. మీరు కారు కొనే ముందు ఆ కారు కంపెనీ వాళ్లకు ఏ బ్యాంకుతో అగ్రిమెంట్ ఉందో కనుక్కోండి. ఆ బ్యాంకు వాళ్ల లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎక్కువగా కొర్రీలు పెట్టకుండా కొంతమేరకు ఈజీగా లోన్ ప్రాసెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పుకున్న అంశాలు అన్నీ బేరీజు వేసుకుని కారు లోన్ తీసుకున్నట్టయితే, మీరు ఏ హెడ్డెక్ లేకుండా కొత్త కారు కొన్నామన్న ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మీకు కొత్త కారు కొన్నామన్న ఆనందం కూడా లేకుండా చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆర్థిక పరమైన అంశాల కోసం మా జీ తెలుగు న్యూస్ బిజినెస్ సెక్షన్ చదువుతూ ఉండండి.

ఇది కూడా చదవండి : Tata Motors Cars on Discount: టాటా కార్లపై రూ. 50,000 డిస్కౌంట్ ఆఫర్స్

ఇది కూడా చదవండి : Car Maintenance Tips: కారు కండిషన్‌లో ఉండేలా మెయింటెన్ చేస్తున్నారా ? లేదా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News