Hyundai Exter SUV Car Review: ఈ సెగ్మెంట్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌తో వస్తోన్న ఫస్ట్ కారు ఇదే

Hyundai Exter SUV Car Review: హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ అయి అవడంతోనే ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తోంది. దక్షిణ కొరియా ఆటోమేకర్ అయిన హ్యూందాయ్ తయారుచేసిన ఈ సబ్-కాంపాక్ట్ SUV కారు వెన్యూ కాంపాక్ట్ SUV కంటే తక్కువలోనే రావడమే కాకుండా ఈ సెగ్మెంట్ లోనే కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Jul 16, 2023, 07:11 PM IST
Hyundai Exter SUV Car Review: ఈ సెగ్మెంట్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌తో వస్తోన్న ఫస్ట్ కారు ఇదే

Hyundai Exter SUV Car Review : హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ అయి అవడంతోనే ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తోంది. దక్షిణ కొరియా ఆటోమేకర్ అయిన హ్యూందాయ్ తయారుచేసిన ఈ సబ్-కాంపాక్ట్ SUV కారు వెన్యూ కాంపాక్ట్ SUV కంటే తక్కువలోనే రావడమే కాకుండా ఈ సెగ్మెంట్ లోనే కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సబ్-కాంపాక్ట్ SUV కారు ఇటీవలే ఇండియాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. హ్యూందాయ్ నుంచే వచ్చిన వెన్యూ, క్రెటా, అల్కాజార్, టక్సన్‌ కార్ల సరసన ఈ హ్యూందాయ్ ఎక్స్ టర్ కూడా వచ్చిచేరింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 5,99,990 లక్షలు కాగా.. హైఎండ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9,99,990 లక్షల వరకు ఉంది. ఈ రెండు ధరలు కూడా ఇంట్రడక్టరీ ఆఫర్ కింద హ్యూందాయ్ అందిస్తున్నవే. కొద్ది రోజుల తరువాత కంపెనీ వీటి ధరలు పెంచే అవకాశం లేకపోలేదు. హ్యుందాయ్ లో చిన్న తరహా SUV కారు ఈ మోడల్లో మొత్తం 5 వేరియంట్స్ లో లభిస్తోంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 19.2 kmpl మైలేజీని అందించనుండగా.. CNG వేరియంట్ 27.1 km/kg మైలేజీని అందిస్తుండటం విశేషం. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2L ఎన్ఏ పెట్రోల్ ఇంజన్‌ కారు. ఆరా, గ్రాండ్ i10 నియోస్, i20లలో ఉపయోగించింది కూడా ఇదే ఇంజన్. 83 PS/ 113.8 Nm అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే సీఎన్జీ వేరియంట్ విషయానికొస్తే.. 69 PS/ 95.2 Nm అవుట్‌పుట్‌ని అందిస్తుంది. అన్ని వేరియంట్స్‌లోనూ 5-స్పీడ్ MT , 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.

సబ్-కాంపాక్ట్ SUV కేటగిరిలో లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ కి ఇండియాలో పోటీ తక్కువనే చెప్పుకోవాలి. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు టాటా పంచ్, సిట్రోయెన్ సి3 కార్లు మాత్రమే ఉండగా కొత్తగా లాంచ్ అయిన ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఆ రెండు కార్లకు పోటీ ఇవ్వనుంది. ఎలాగూ ఇండియాలో సిట్రోయెన్ సీ3 కి అంతగా మార్కెట్ లేదు కనుక దీని ప్రభావం ఎక్కువగా టాటా పంచ్ పైనే పడే అవకాశాలు ఉన్నాయి.

5 సీటింగ్ కెపాసిటీ కలిగిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV కారు మొత్తం 3,815mm పొడవు , 1,710 mm వెడల్పు , 2,450mm వీల్‌బేస్, 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. లగేజీ క్యారీ చేయడం కోసం విశాలమైన 391-లీటర్ బూట్ స్పేస్ ఉండేలా కారుని డిజైన్ చేశారు. హ్యూందాయ్ ఎక్స్‌టర్ పార్కింగ్ డిస్టన్స్, ESC, ABSతో పాటు EBD మాత్రమే కాకుండా స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్స్ తో వస్తోన్న మొట్టమొదటి కాంపాక్ట్ SUV కూడా ఇదే.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV కారులో 8 అంగుళాల HD టచ్‌స్క్రీన్, 4.2 అంగుళాల అడ్వాన్స్ డ్ డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యాప్చర్ చేసేలా డ్యుయల్ కెమెరా ఫీచర్ ఉన్న డాష్‌క్యామ్‌తో పాటు సన్‌రూఫ్‌ కూడా ఉండటం విశేషం. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న కాంపాక్ట్ SUV కార్లలో ఇదే ముందుంటుంది అనుకోవచ్చు.

Trending News