Tata Motors Cars on Discount: టాటా కార్లపై రూ. 50,000 డిస్కౌంట్ ఆఫర్స్

Tata Motors Cars Discount: త్వరలో మీరు కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, అందుకు ఈ నెల సరైన సమయం అంటోంది టాటా మోటార్స్. అవును.. టాటా మోటార్స్ తమ కంపెనీ కార్లపై రూ. 50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో ఏయే కారుపై ఎంత వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం రండి.  

Written by - Pavan | Last Updated : Jul 18, 2023, 12:54 PM IST
Tata Motors Cars on Discount: టాటా కార్లపై రూ. 50,000 డిస్కౌంట్ ఆఫర్స్

Tata Motors Cars Discount: త్వరలో మీరు కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? అయితే, అందుకు ఈ నెల సరైన సమయం అంటోంది టాటా మోటార్స్. అవును.. టాటా మోటార్స్ తమ కంపెనీ కార్లపై రూ. 50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది. టాటా మోటార్స్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోన్న కార్లలో టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ వంటి హ్యాచ్ బ్యాక్ కార్లు, టాటా టిగోర్ సెడాన్ కారు అలాగే టాటా హ్యారియర్ తో పాటు టాటా సఫారి వంటి SUV కార్లు ఉన్నాయి. ఇందులో ఏయే కారుపై ఎంత వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది అనే విషయాలు తెలుసుకుందాం రండి.

టాటా టిగోర్ కారు : 
టాటా టిగోర్ కారు పెట్రోల్ వెర్షన్, సీఎన్జీ వెర్షన్ కార్లపై టాటా మోటార్స్ రూ. 50 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ. 35 వేలు నగదు తగ్గింపు కాగా ఎక్స్ చేంజ్ బోనస్ కింద రూ. 10 వేలు, కార్పొరేట్ బోనస్ కింద మరో రూ. 5 వేలు తగ్గింపు అందిస్తోంది.

టాటా టియాగో కారు :
టాటా టియాగో కారుపై టాటా మోటార్స్ రూ. 45 వేలు తగ్గింపు అందిస్తోంది. పెట్రోల్ వెర్షన్, సీఎన్జీ వెర్షన్ కార్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. రూ. 45 వేల తగ్గింపులో రూ. 20 వేలు క్యాష్ డిస్కౌంట్ కాగా , ఎక్స్ చేంజ్ బోనస్ కింద రూ. 10 వేలు అందిస్తోంది. ఇవే కాకుండా పెట్రోల్ వెర్షన్ కారుపై రూ. 5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుండగా సీఎన్జీ వెర్షన్ పై రూ. 10 వేలు అదనపు డిస్కౌంట్ లభిస్తోంది.

టాటా హ్యారియర్, టాటా సఫారీ కార్లపై డిస్కౌంట్ ఆఫర్స్
టాటా టిగోర్, టాటా టియాగో కార్లతో పాటు టాటా హ్యారియర్, టాటా సఫారీ వంటి SUV కార్లపై కూడా టాటా మోటార్స్ డిస్కౌంట్ అందిస్తోంది. టాటా సఫారి, టాటా హ్యారియర్ కార్లపై రూ. 35 వేలు తగ్గింపు లభిస్తోంది. అయితే, కొత్తగా లాంచ్ అయిన రెడ్ డార్క్ ఎడిషన్ కారుకు ఈ డిస్కౌంట్ ఆఫర్లు వర్తించవు అని కంపెనీ స్పష్టంచేసింది.

టాటా ఆల్ట్రోజ్ కారు :
టాటా ఆల్ట్రోజ్ కారుపై రూ. 28 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజీల్, సీఎన్జీ వెర్షన్లలో వస్తుండగా.. డిస్కౌంట్ ఆఫర్ మాత్రం కేవలం పెట్రోల్, డీజిల్ వెర్షన్ కార్లపైనే ఇస్తోంది. ఇందులో సీఎన్జీ వేరియంట్ ఇటీవలే లాంచ్ అయిన నేపథ్యంలో దీనిపై ఈ డిస్కౌంట్ ఆఫర్ లభించడం లేదు. 

టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లకు డిస్కౌంట్ వర్తిస్తుందా ?
టాటా నెక్సాన్, టాటా పంచ్ కార్లపై డిస్కౌంట్ ఇవ్వడం లేదని టాటా మోటార్స్ కంపెనీ స్పష్టంచేసింది. ఈ రెండు కార్లు కూడా టాటా కార్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో ముందు వరుసలో నిలుస్తాయి. అందుకే వాటిపై ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం లేదు అని టాటా మోటార్స్ వెల్లడించింది.

Trending News