Aadhaar Card Update: ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడం ఎలా

Aadhaar Card Update: నిత్య జీవితంలో ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. ప్రస్తుతం ఆధార్ అప్‌డేట్ సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 12, 2024, 03:31 PM IST
Aadhaar Card Update: ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు, ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవడం ఎలా

Aadhaar Card Update: ఉచిత ఆధార్ కార్డు అప్‌డేట్ సేవల్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆధార్ అప్‌డేట్ సేవల్ని మరో మూడు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు అప్‌డేటెడ్ సేవలు ఇప్పుుడు ఉచితంగా లభిస్తున్నాయి. 

ఆధార్ కార్డు అప్‌డేట్ సేవల్ని ఉచితంగా అందుకునేందుకు మార్చ్ 14 వరకూ గడువుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడీ గడువును మూడు నెలలు పొడిగించింది. అంటే జూన్ 14వ తేదీ వరకూ ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ అధికారికంగా ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది. myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్ ఉచిత అప్‌డేటెడ్ సేవలు పొందవచ్చు. 

ఆధార్ కార్డు అప్‌డేట్ సేవలు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే ఉచితంగా అందనున్నాయి. ఆధార్ సెంటర్‌లో చేయించుకోవాలంటే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకు ఎక్కౌంట్ ఓపెనింగ్, ప్రభుత్వ పథకాల లబ్ది, సిమ్ కార్డు కొనుగోలు, ఇంటి కొనుగోలు ఇలా దేనికైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించకపోతే ఇబ్బందులు ఎదురు కావచ్చు. 

ఆదార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో కూడా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవచ్చు. డెమోగ్రఫిక్ డేటా, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలను ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిందే.

ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలంటే ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇందులో ఆధార్ కార్డు అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఏది అప్‌డేట్ చేయాలో అది క్లిక్ చేయాలి. ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయిన్ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. పుట్టిన తేదీ, పేరు మార్పు, చిరునామా వివరాలకు మాత్రమే ప్రూఫ్ అవసరమౌతుంది. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ మార్చేందుకు ప్రూఫ్ అవసరం లేదు. చివర్లో యూఆర్ఎన్ నెంబర్ జారీ అవుతుంది. ఈ నెంబర్ సహాయంతో ఆధార్ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Also read: Electoral Bonds Donations: ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో అత్యధిక వాటా బీఆర్ఎస్ పార్టీదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News