Public Provident Fund: పీపీఎఫ్‌లో పెట్టుపెడి పెట్టే వరకు గుడ్‌న్యూస్.. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తే..!

Union Budget 2023: ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు బడ్జెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఆదాయపన్ను చెల్లింపుదారులు తమకు ఉపయోకరంగా ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2023, 11:35 AM IST
Public Provident Fund: పీపీఎఫ్‌లో పెట్టుపెడి పెట్టే వరకు గుడ్‌న్యూస్.. ఆ డిమాండ్‌కు అంగీకరిస్తే..!

Union Budget 2023: ప్రతి సంవత్సరం జనవరి నెల కొత్త ఆశలతో వస్తుంది. కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌పై కూడా సామాన్యుల అంచనాలు పెట్టుకుంటారు. వ్యాపారవేత్తల నుంచి ఆర్థిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉంటాయి. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ తమ సిఫార్సులను అందించారు. రూ.5 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయాలని ఉద్యోగ వృత్తి నుంచి వస్తున్న అతిపెద్ద డిమాండ్. అంతేకాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పెట్టుబడి పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది.

పీపీఎఫ్ వార్షిక డిపాజిట్ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)సిఫార్సు చేసింది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారవేత్తలకు కూడా ఇది ఇష్టమైన పొదుపు పథకం. ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపితే.. ఎంతోమందికి ప్రయోజకరంగా మారనుంది. 

పీపీఎఫ్ డిపాజిట్ పరిమితిని తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉందని ఐసీఏఐ పేర్కొంది. పన్ను చెల్లింపుదారులను పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించేందుకు గృహ బీమా, ప్రయాణ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా తదితర ప్రీమియంలపై ప్రత్యేక మినహాయింపులను అనుమతించాలని కూడా కోరింది.

ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఎ) విషయానికి వస్తే పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్రయోజనం మెట్రో, నాన్-మెట్రో నగరాల ఆధారంగా కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నిపుణులు కూడా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలతో పాటు, ఇతర మెట్రో నగరాల్లో కూడా బేసిక్ జీతంలో 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ప్రయోజనం పొందాలని సూచించారు.

పీపీఎఫ్ అంటే ఏమిటి..?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన.. దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటి. రిటైర్మెంట్ తర్వాత చాలా కాలం పాటు ఇన్వెస్టర్లు పొదుపు చేసుకునేందుకు ఇది పొదుపు పథకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీవిత భాగస్వామి పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే.. పెట్టుబడిదారుడి పీపీఎఫ్‌ పెట్టుబడి పరిమితిని కూడా రెట్టింపు చేస్తుంది. అయితే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఇప్పటికీ రూ.1.5 లక్షలుగా ఉంది.

Also Read: MP Santokh Singh Chaudhary: భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

 

Also Read: Team India Squads: టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ ఔట్.. పృథ్వీ షాకు పిలుపు.. వన్డే జట్టులోకి ఊహించని ప్లేయర్‌కు చోటు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News