ATM నుంచి Cash కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయారా ? మీ Money ఏమవుతుంది ?

Forgot to collect cash from ATM machine: ప్రస్తుతం దేశం అంతా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ( Cashless transactions) ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఇప్పటికీ ఇంకా క్యాష్‌పై ఆధారపడే పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2021, 06:43 AM IST
  • ATM ల ోమనీ డ్రా చేసేందుకు వెళ్తున్నారా ? అయితే ఈ విషయాల గురించి మీకు ఐడియా ఉందా ?
  • ఏటీఎంలో డబ్బులు బయటికి రాకుండానే మీ ఖాతాలో డబ్బులు కట్ అయినట్టుగా మెసేజ్ వస్తే ఏమవుతుంది ?
  • డబ్బులు డ్రా చేసి వాటిని తీసుకోవడం మర్చిపోయి వెళ్లిపోతే ఆ డబ్బు ఏమవుతుంది ?
ATM నుంచి Cash కలెక్ట్ చేసుకోవడం మర్చిపోయారా ? మీ Money ఏమవుతుంది ?

Forgot to collect cash from ATM machine ?: ప్రస్తుతం దేశం అంతా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ( Cashless transactions) ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఇప్పటికీ ఇంకా క్యాష్‌పై ఆధారపడే పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. అందుకోసం నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే.. దగ్గర్లోని ఎటిఎం సెంటర్‌కి వెళ్లాల్సిందే. ఈ ప్రక్రియలో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 

కొన్నిసార్లు కార్డును మెషీన్ లోపల స్వైప్ చేసి అందులోనే వదిలివేస్తాం. లేదా ఇంకొన్నిసార్లు ఏదో ఓ సమస్య కారణంగా లావాదేవీ రద్దు ( Transaction cancelled) అవుతుంది. 

పై రెండూ కాకుండా మీరు ఏ ఇబ్బంది లేకుండా Money draw చేసి కార్డు తీసుకుని ఆ నగదును ATM machine నుంచి తీసుకోవడం మర్చిపోతే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? అలాంటి సమస్య ఎప్పుడైనా ఎదురైతే ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే. 

ఏటీఎంలో డబ్బులు బయటికి రాకుండానే మీ ఖాతాలో డబ్బులు కట్ అయినట్టుగా మెసేజ్ వస్తే.. (Amount deducted from the bank but money not collected from ATM):

ATM withdrawals చేసే సమయంలో మీ ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయినట్టుగా మీకు SMS వచ్చి క్యాష్ మాత్రం ఏటీఎం మెషిన్ నుంచి బయటికి రాలేదా ? అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు డ్రా కానప్పుడు ఇబ్బంది పడటం సహజమే కానీ అంతకు మించి డబ్బు ఏమవుతుందోనని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతి 24 గంటల నుండి 48 గంటల్లో మీ డబ్బు మీ ఖాతాకు తిరిగి జమ అవుతుంది. 

ఏదేమైనా, డబ్బు మీ ఖాతాలో తిరిగి క్రెడిట్ అవకపోయినట్టయితే (What if money not credited into account).. అప్పుడు మీరు మీ బ్యాంకుకు అసలు వివరాలు తెలియజేస్తూ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మీరు మనీ డ్రా చేసినప్పటి ట్రాన్సాక్షన్ ఐడిని బ్యాంకుకి అందించాలి. ఆ తర్వాత బ్యాంకు వారే చెక్ చేసి మీ మనీని తిరిగి క్రెడిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు.

Also read : Cheap and best smartphones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

మనీ డ్రా చేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం మర్చిపోయారా ? (You forgot to collect money from the ATM  ?):

ఇటీవల కాలంలో కొత్తగా వస్తున్న ఏటిఎం మెషిన్స్ ఎలా ఉన్నాయంటే.. మీరు డబ్బు వసూలు డ్రా చేస్తే ఆ నగదును మెషిన్ నుంచి తీసుకునే వరకు మీ ATM card ను తిరిగి పొందలేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పలుచోట్ల ఇంకా స్వైపింగ్ టెక్నాలజీతో పనిచేసే పాత ఏటిఎంలే ఉన్నాయి. అలాంటి చోట మీరు డబ్బు డ్రా చేసి Debit card ను తీసుకుని డబ్బులు తీసుకోవడం మర్చిపోతేనే అసలు సమస్య వచ్చి పడుతుంది. 

డబ్బులు డ్రా చేసి వాటిని తీసుకోవడం మర్చిపోయి వెళ్లిపోతే ఆ డబ్బుకు బ్యాంక్ ఎలాంటి బాధ్యత వహించదు. బ్యాంకు దృష్టిలో అది విజయవంతమైన లావాదేవీగానే పరిగణిస్తారు. ఇలాంటి సమస్య ఎదురైతే అక్కడి ఏటీఎం మెషిన్‌లోని సిసిటివి ఫుటేజీని పరిశీలించడం ద్వారా దీనిని ట్రాక్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగని మీ డబ్బు మీకు తిరిగి వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. అంటే మీరు మీ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి . 

Also read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ

ATM Money drawing rules విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటేంటే.. ఒకసారి ఏటిఎం మెషీన్ నుంచి డబ్బు బయటకు వచ్చిన తర్వాత మెషిన్ ఆ డబ్బును తిరిగి తీసుకోదు. అందుకే ఏటీఎంలో విత్ డ్రా చేసిన మనీని తీసుకోవడం మర్చిపోవద్దు. ఏటీఎం సెంటర్ నుంచి బయటికొచ్చే ముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News