ATM withdrawals rules: వచ్చే నెల నుంచి మళ్లీ బ్యాంకుల బాదుడు

ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం.

Last Updated : Jun 27, 2020, 04:45 PM IST
ATM withdrawals rules: వచ్చే నెల నుంచి మళ్లీ బ్యాంకుల బాదుడు

ATM withdrawals limit rules: కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన అనంతరం ఖాతాదారుల ఆర్థిక వెసులుబాటు నిమిత్తం బ్యాంకులు అందించిన రెండు ఉచిత సేవలు ఈ నెల ఆఖరు నుంచి ముగుస్తున్నాయి. అందులో ఒకటి ఉచిత ఏటీఎం విత్ డ్రావల్స్ సౌకర్యం కాగా మరొకటి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం. అవును.. జూలై ఒకటి నుంచి ఈ రెండు సేవల విషయంలో మళ్లీ బ్యాంకులు కస్టమర్లపై బాదుడు ప్రారంభించనున్నాయి. నిర్ణీత విత్ డ్రాయల్స్ ( Atm Withdrawals ) దాటినా... కనీస బ్యాలెన్స్ ( Minimum balance ) లేకపోయినా బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై ఛార్జీల మోత తప్పేలా లేదు. 

ఏటీఎంలలో ఎక్కడైనా.. ఎప్పుడైనా మనీ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ… నెలలో ఉచితంగా ఎన్నిసార్లు ఈ లావాదేవీలు చేసుకోవచ్చు అనే విషయంలోనే బ్యాంకులు వాటిపై స్పష్టమైన పరిమితులు విధించాయి. ఆ పరిమితి దాటితే ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఇక బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ విషయంలో ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా సరే.. బ్యాంకుకు పెనాల్టీ చెల్లించాల్సిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా గత కొద్దికాలంగా ఈ బాదుడు నుంచి అందరూ ఉపశమనం పొందారు. జూన్ 30 వరకూ ఏటీఎంల విత్ డ్రాయల్స్‌పై గానీ, కనీస బ్యాలెన్స్‌పై గానీ ఆంక్షలు, పరిమితుల నుంచి కేంద్ర ఆర్ధిక శాఖ ( Finance ministry ) మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడీ గడువు జూన్ 30 నుంచి ముగుస్తోంది. ఆ గడువును పొడిగంచే విషయంలో ఇంకా ఏ విధమైన ప్రకటనలు రాలేదు. దాంతో జూలై 1 నుంచి తిరిగి బాదుడు ప్రారంభం కానుంది. 

సేవింగ్ ఎక్కౌంట్స్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకుకు ఒక్కోరకంగా ఉంది. అత్యథికంగా 10 వేల వరకూ ఉంది. మార్చ్ 10వ తేదీన ఎస్బీఐకి ( SBI ATM ) చెందిన దాదాపు 44 కోట్ల 51 లక్షల సేవింగ్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్‌ను తొలగించింది. మరోవైపు ఏటీఎం విత్ డ్రాయల్స్ విషయంలోనూ ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదు లావాదేవీలకు... ఇతర ఏటీఎంల నుంచి 3 విత్ డ్రాయల్స్‌కు పరిమితి ఉండేది. ఇది దాటితే కనీసం ఒక్కో లావాదేవీకు 8 రూపాయల 20 పైసలు చొప్పున ఛార్జెస్ విధించేవారు. అటు ఎస్బీఐ అయితే తమ బ్యాంకు ఖాతాదారులకు నెలకు 8 సార్లు విత్ డ్రాయల్స్ పరిమితి కల్పించింది. నాన్ మెట్రో నగరాల్లో అయితే ఈ పరిమితి పది వరకూ ఉంది.

Trending News