Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి

Whatsapp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్..యూజర్లకు భారీగా షాకిచ్చింది. ఏకంగా 18 లక్షల కంటే ఎక్కువ భారతీయ ఎక్కౌంట్లను నిషేధించింది. అంత పెద్ద సంఖ్యలో ఇండియన్ యూజర్స్‌ను ఎందుకు టార్గెట్ చేసింది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2022, 07:35 PM IST
Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి

Whatsapp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్..యూజర్లకు భారీగా షాకిచ్చింది. ఏకంగా 18 లక్షల కంటే ఎక్కువ భారతీయ ఎక్కౌంట్లను నిషేధించింది. అంత పెద్ద సంఖ్యలో ఇండియన్ యూజర్స్‌ను ఎందుకు టార్గెట్ చేసింది..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఐటీ నిబంధనలు 2021ను వాట్సప్ అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా మార్చ్ నెలలో ఇండియాలోని 18 లక్షల కంటే ఎక్కువ ఎక్కౌంట్లను బ్యాన్ చేసింది. ఫిబ్రవరి నెలలో 14 లక్షల కంటే ఎక్కువ ఖాతాలపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో 597 ఫిర్యాదులు అందాయని..అందులో చర్యలు తీసుకోవల్సినవి 74 ఉన్నాయని వాట్సప్ వెల్లడించింది.

ఐటీ 2021 ప్రకారం మార్చ్ 2022 కు సంబంధించి నివేదికను వాట్సప్ వెలువరించింది. ఈ నివేదికలో యూజర్ల ఫిర్యాదులు, వాట్సప్ చేపట్టిన చర్యలు, వాట్సప్ స్వయంగా చేపట్టిన చర్యల వివరాలున్నాయి. మార్చ్ నెలలో వాట్సప్ 18 లక్షల కంటే ఎక్కువ ఖాతాల్ని నిషేధించింది. ఏళ్ల తరబడి యూజర్లను వాట్సప్ వేదికపై సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఇతర అధునాతన పద్ధతుల్ని ప్రవేశపెడుతూ వచ్చింది. కొత్త ఐటీ నియమాలు 2021 ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ యూజర్లున్న డిజిటల్ , సోషల్ మీడియా వేదికలు మంత్లీ రిపోర్ట్ వెలువరించాల్సి ఉంటుంది.

Also read: Nissan New Model: 'డాట్సన్' నిలిపివేత.. ఇండియన్ మార్కెట్‌లోకి నిస్సాన్ కొత్త మోడల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News