Nissan New Model Car: జపాన్‌కి చెందిన కార్ల తయారీ దిగ్గజం 'నిస్సాన్' ఇండియన్ మార్కెట్లోకి కొత్త మోడల్ కారును ప్రవేశపెట్టనుంది. అందుబాటు ధరలో ఉన్న 'డాట్సన్' బ్రాండ్ ప్రొడక్షన్‌ను నిలిపివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త మోడల్‌ను తీసుకురానుంది. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నెరసు ఈ విషయాన్ని వెల్లడించారు.
రెనాల్ట్-నిస్సాన్ పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా కొత్త మోడల్ కారును ప్రవేశపెట్టాలని నిస్సాన్ కంపెనీ నిర్ణయించినట్లు తెన్నెరసు తెలిపారు. సెమీ కండక్టర్స్ కొరత ఉన్నప్పటికీ తమిళనాడులోని ఒర్గదం ప్లాంట్‌లో ప్రొడక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు. దేశీ మార్కెట్‌తో పాటు విదేశాల నుంచి ఉన్న డిమాండ్ రీత్యా ప్రొడక్షన్ కొనసాగుతోందన్నారు. ఇటీవల ఇదే మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో Magnite ఎస్‌యూవీ ప్రొడక్షన్ 50వేల మార్క్‌ని చేరిందన్నారు.
డాట్సన్ కార్ల ప్రొడక్షన్‌ను నిలిపివేయాలని నిస్సాన్ నిర్ణయించడంతో... తమిళనాడులోని ఆ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మూతపడుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన అన్నాడీఎంకె పార్టీ కోఆర్డినేటర్ పన్నీర్ సెల్వం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తెన్నెరసు నిస్సాన్ కార్యకలాపాలపై ఒక ప్రకటనలో స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం తమిళనాడులోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్‌లో నిస్సాన్ బ్రాండ్ మోడల్స్‌తో పాటు రెనాల్ట్ కైగర్, రెనాల్ట్ క్విడ్ కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే కార్లు భారత్‌లో విక్రయించడంతో పాటు మరో 15 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
Also Read: Bandi Sanjay: కోయిల్ సాగర్ పనులు చూస్తే కోట శ్రీనివాస్ గుర్తుకొస్తున్నరు: బండి
Also Read: Revanth Reddy: చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. సీఎల్పీ అత్యవసర సమావేశం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.