Xiaomi 13 Pro 5G Mobile: మూడు 50MP కెమెరాలతో వస్తోన్న సూపర్ 5G ఫోన్

Xiaomi 13 Pro 5G Mobile Price, Specs: షావొమి 13 ప్రో ఫోన్ వెనుక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ అమర్చారు. 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా, 50MP ఫ్లోటింగ్ టెలిఫోటో సెన్సార్, 50MP వైడ్ యాంగిల్ సెన్సార్ కలిగి ఉన్న ఏకైక ఫోన్ కూడా ఇదే. ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 08:24 PM IST
Xiaomi 13 Pro 5G Mobile: మూడు 50MP కెమెరాలతో వస్తోన్న సూపర్ 5G ఫోన్

Xiaomi 13 Pro 5G Mobile Price, Specs: ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌ని ఇష్టపడే వారికి షావొమి 13 సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా  కస్టమర్స్ ముందుకొచ్చిన ఫోన్ షావొమి 13 ప్రో. 2022 డిసెంబర్‌లోనే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ తాజాగా ఇండియాలోనూ ఎంట్రీ ఇచ్చింది. 4,820mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేసే షావొమి 13 ప్రో ఫోన్ స్మార్ట్‌ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల స్క్రీన్‌ని అమర్చారు.

ఇండియాలో కొత్తగా లాంచ్ అయిన ఈ ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999 గా ఉండగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో ఫోన్‌ కొనుగోలు చేసే వారికి తక్షణమే రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఫోన్ ధర రూ. 69,999 కి దిగొచ్చింది.

అమెజాన్, Mi.com, Mi హోమ్, రిటైల్ పార్ట్‌నర్స్, Mi స్టూడియోస్‌తో సహా అనేక ఆన్‌లైన్ రిటైలర్స్ వద్ద ఈ 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆండ్రాయిడ్ 13తో పనిచేసే ఫోన్లలో మొదటి ఫోన్‌గా షావోమి కంపెనీ ప్రకటించింది. షావొమి 13 ప్రో కోసం లైకా 75mm ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్‌ అమర్చారు. ఇలాంటి లెన్స్‌తో వస్తోన్న ఫోన్లలోనూ ఇదే మొదటిది కావడం విశేషం. 

ఈ ఫోన్ వెనుక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ అమర్చారు. 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా, 50MP ఫ్లోటింగ్ టెలిఫోటో సెన్సార్, 50MP వైడ్ యాంగిల్ సెన్సార్ కలిగి ఉన్న ఏకైక ఫోన్ కూడా ఇదే. ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. షావొమి 13 సిరీస్ ప్రో మోడల్ 12GB వరకు RAM అలాగే 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్స్‌పాండ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. 120W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్ధ్యం షావోమి 13 ప్రో 5G మొబైల్ సొంతం.

ఇది కూడా చదవండి : Goat Milk Ice Cream: మేక పాలతో ఐస్ క్రీమ్.. రోజుకు రూ. 10 లక్షలు సంపాదన

ఇది కూడా చదవండి : Lost your PAN card?: మీ పాన్ కార్డు పోయిందా ? ఇలా చేయండి

ఇది కూడా చదవండి : Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo

Trending News