Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు

Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5 రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి G, రెండు GX, మూడోది VX, నాలుగోది ZX కాగా ఇక ఐదో వేరియంట్ ZX (O) ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో 7 లేదా 8 సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు.

Written by - Pavan | Last Updated : Feb 28, 2023, 05:25 AM IST
Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు

Toyota Innova Hycross: ఇండియన్ SUV కార్ల మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా కారు ఆధిపత్యానికి తిరుగులేదు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ ఎస్‌యువి కార్లలో హ్యూందాయ్ క్రెటానే అన్నింటికంటే ముందుంటుంది. అయితే, ఒకవేళ మీరు క్రెటా బడ్జెట్‌లోనే ఎస్ యువి ఫీల్ తో 7 సీట్ల కారు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఇప్పుడు అది కూడా సాధ్యమే అవుతుంది. టయోటా కంపనీ ఇటీవల లాంచ్ చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి కారు ఫీచర్ల పరంగా ఇతర ఏ ఎస్‌యువి కార్ల కంటే అస్సలు తక్కువేమీ కాదు. అన్నట్టు కేవలం రూ. 50 వేలతో టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ కారు గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొంత సమాచారం తెలుసుకోవాల్సిందే. అవేంటో చూద్దాం రండి.

హ్యుందాయ్ క్రెటా టాప్ మోడల్ కారు ధర రూ. 18.68 లక్షలుగా కాగా.. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు బేస్ వేరియంట్ ధర రూ. 18.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఈ కారు ఎమ్‌పివి కారు అయినప్పటికీ, టయోటా కంపెనీ ఈ కారుకు ఎస్‌యువి లుక్ లో డిజైన్ చేసింది. దీంతో ఇది బేస్ మోడల్ అయినప్పటికీ.. లుక్స్ పరంగా అనేక ఇతర కాంపాక్ట్ SUV లకు కూడా గట్టి పోటీని ఇస్తోంది. హ్యుందాయ్ క్రెటాతో పాటు, మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారి, ఎంజీ హెక్టార్ ప్లస్, కియా కార్నివాల్‌ వంటి భారీ ఎస్‌యువి వాహనాలతో టయోటా ఇన్నోవా హైక్రాస్ వాహనం పోటీపడుతోంది.

ఇంజిన్, గేర్ బాక్స్ :
టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5 రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి G, రెండు GX, మూడోది VX, నాలుగోది ZX కాగా ఇక ఐదో వేరియంట్ ZX (O) ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో 7 లేదా 8 సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు. బేస్ మోడల్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో తయారైన టయోటా ఇన్నోవా  172hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 23Kmpl కంటే ఎక్కువ మైలేజ్ ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు సొంతం.

టయోటా ఇన్నోవా హైక్రాస్ జి ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
ఎల్ఇడి హెడ్‌ల్యాంప్
16 అంగుళాల స్టీల్ వీల్స్
బ్లాక్ ఫాబ్రిక్ అప్హోల్స్టరీ
4-స్పీకర్ ఆడియో సిస్టమ్
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
వెహికిల్ స్టెబిలిటి కంట్రోల్
హిల్-హోల్డ్ అసిస్ట్
అనలాగ్ స్పీడోమీటర్
4.2 అంగుళాల MID డిస్‌ప్లే

Trending News