Goat Milk Ice Cream Business Idea: ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా మీ జీవితాన్ని కచ్చితంగా మార్చేస్తుంది. ఈ విషయం ఎన్నో స్టార్టప్ కంపెనీల టర్నోవర్ విషయంలో ప్రూవ్ అయింది. పెట్టుబడి లేని రోజుల నుంచి వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిన స్టార్టప్ కంపెనీలను ఎన్నో చూశాం. పర్ఫెక్ట్ బిజినెస్ ఐడియా పనితీరు అలా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ స్థాపించిన స్టార్టప్ కంపనీ కూడా అలా సక్సెస్ అయిందే.
అయితే, ఏ బిజినెస్ అయినా సక్సెస్ కావాలంటే దానికి ఒక సీక్రెట్ ఉంటుంది. ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ వీళ్లు స్థాపించిన బిజినెస్ కూడా అలాంటిదే. వీళ్లు సరిగ్గా ఆరేళ్ల క్రితం ఒక ఐస్ క్రీమ్ బిజినెస్ స్థాపించారు. ఇప్పుడు ఆ బిజినెస్ వారికి రోజుకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 10 నుంచి 11 లక్షల వరకు సంపాదించి పెడుతోంది. ఐస్ క్రీమ్ బిజినెస్‌లో అంత ప్రాఫిట్స్ ఉంటాయా ? వీళ్ల ఐస్ క్రీమ్ సీక్రెట్స్ ఏంటి అనే కదా మీ సందేహం. మరేం లేదు.. వీళ్లు తయారు చేస్తోంది రెగ్యులర్‌గా చేసే గేదే పాలతో కాదు.. మేక పాల రెసిపితో తయారు చేస్తోన్న ఐస్ క్రీమ్ ఇది.
ఇంతకీ వీళ్లిద్దరు ఎవరు ?
ఈ ఇద్దరిలో ఒకరి పేరు కన్వర్ప్రీత్ కాగా మరొకరి పేరు మన్మీత్. వీళ్లిద్దరూ ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితులే. గతంలో ఇద్దరూ కలిసి ఎన్నో వ్యాపారాలు చేశారు. ఇద్దరూ కలిసి ఎన్నో బిజినెస్ ఐడియాలు ఇంప్లిమెంట్ చేశారు. అలా కలిసి ట్రావెల్ చేసే క్రమంలోనే స్నేహితులు ఇద్దరూ కలిసి 2016 లో యూరప్ ట్రిప్‌కి వెళ్లారు. అక్కడే వారికి ఈ మేక పాల ఐస్ క్రీమ్ బిజినెస్ కంటపడింది. అది చూసి వచ్చాకా ఆ ఐడియాకు వీళ్ల తెలివి కూడా జోడించి మేకపాలతో తయారయ్యే ఐస్ క్రీమ్ బిజినెస్ మొదలుపెట్టారు.
చిన్నగా మొదలైన ఈ మేకపాల ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రస్తుతం 50 స్టోర్లకు విస్తరించింది. ఢిల్లీ నుంచి చంఢీగడ్, ముంబైకి కూడా తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఎయిర్ ఇండియా కార్గో సేవలు ఉపయోగించుకుని మరీ బిజినెస్ చేసే స్థాయికి ఎదిగారు. వీళ్ల స్టోర్‌లో 3 రోజులకు మించి ఏ ఐస్ క్రీమ్ ఉండకుండా జాగ్రత్తపడతారు. అంత ఫ్రెష్‌గా ఐస్ క్రీమ్ చేసి సేల్ చేస్తారు. రోజుకు రూ. 10 లక్షల చొప్పున నెలకు రూ. 2.75 కోట్ల టర్నోవర్ సంపాదించే స్థాయికి ఎదిగారు. అలాగని ఈ ఐస్ క్రీమ్ ఖరీదు చాలా ఎక్కువేమో అని అనుకోవద్దు. ఎందుకంటే రూ. 79 నుంచే వీళ్ల ఐస్ క్రీమ్ కాస్ట్ ప్రారంభ ధరలు ఉంటాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 45 ఫ్లేవర్స్‌లో ఐస్ క్రీమ్స్ లభిస్తాయి. వీళ్ల బిజినెస్ వీళ్లను హీరోలను చేసింది. అందుకే కన్వర్ప్రీత్, మన్మీత్ ఇద్దరూ ఇప్పుడిలా వార్తల్లో వ్యక్తులు అయ్యారు.
ఇది కూడా చదవండి : Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు
ఇది కూడా చదవండి : Honda 100CC Bike: హోండా నుంచి 100CC బైక్.. ఎంట్రీ లెవెల్లోనే టాప్ మోడల్ ఫీచర్స్ ?
ఇది కూడా చదవండి : PAN-Aadhaar Linking: మార్చి 2023 లో మర్చిపోకుండా చేయాల్సిన ముఖ్యమైన పనులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook