Ahmedabad Road Accident: ఇస్కాన్ బ్రిడ్జ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

Iskcon Bridge Road Accident: అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాగ్వార్ కారు వేగంగా జనాలపై దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 20, 2023, 07:23 AM IST
Ahmedabad Road Accident: ఇస్కాన్ బ్రిడ్జ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

Iskcon Bridge Road Accident: అహ్మదాబాద్ నగరంలోని సర్ఖేజ్-గాంధీనగర్ (ఎస్‌జీ) హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసు కానిస్టేబుల్ మరియు హోంగార్డు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా..

బ్రిడ్జిపై మహీంద్రా థార్ వాహనం డంపర్ ట్రక్కును వెనుక నుంచి ఎస్‌యూవీ కారు ఢీకొట్టింది. స్థానికులు గమనించి కారులో ఉన్న వారిని రక్షించేందుకు ఈ ప్రయత్నించారు. ఏం జరిగిందోనని భారీగా జనం గుమిగుడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. వేగంగా వచ్చిన జాగ్వార్ కారు.. ఆ జనాల గుంపుపై దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లు 20 నుంచి 25 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 13 మంది గాయపడ్డారు.

నిత్యం రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్ వద్ద తెల్లవారుజామున 1:15 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రాజ్‌పథ్ క్లబ్ ప్రాంతం నుంచి జాగ్వార్ కారు వేగంగా జనంలోకి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించారు.   

 

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సోలాలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరిని అసర్వా ఆధారిత సివిల్ ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. జాగ్వార్ కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!  

Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News