Landslide Viral Video: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో భారీగా ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఇళ్లు కూలిపోవడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారీ బండరాయి పై నుంచి దూసుకుని రాగా.. ఓ జేసీబీ డ్రైవర్ క్షణాల్లో ప్రాణాలను దక్కించుకుని బయటపడ్డాడు. ఆ డ్రైవర్‌తోపాటు పలువురు కార్మికులు సైతం రాళ్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు.
హిమాచల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడడంతో చండీగఢ్-మనాలి హైవే మండి, కులు మధ్య రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టింది. జేసీబీ సాయంతో కార్మికులు కొండచరియలను తొలగించే పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలో జేసీబీ యంత్రంపై పై నుంచి బండరాళ్లు దూసుకువ్చి పడ్డాయి. రాళ్లు వేగంగా దూసుకురావడం గుర్తించిన కార్మికులు తృటిలో తప్పించుకుని దూరంగా పారిపోయి వచ్చారు. ఈ ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కాసేపటి తరువాత మళ్లీ మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెదర్‌మ్యాన్ శుభమ్ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
A narrow escape for JCB drivers and other persons as Big boulders fell down on 7 mile
17th July 2023
Mandi , Himachal Pradesh pic.twitter.com/ncAK9699pm— Weatherman Shubham (@shubhamtorres09) July 17, 2023
హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో పడిపోతున్న బండరాళ్ల నుంచి జేసీబీ డ్రైవర్, కార్మికులు తృటిలో తప్పించుకున్నారంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముందుగా కొండల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రహదారి నిర్మాణ పనులు ఎలా చేపట్టారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంందన్నారు. రాష్ట్రంలో తరచుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..
Also Read: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook