Tirupati: విహారంలో విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Tirupati Car Accident: తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో కారు దూసుకెళ్లడంతో ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 09:28 PM IST
Tirupati: విహారంలో విషాదం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి

Tirupati Car Accident: విహారంలో విషాదం నింపిన ఈ సంఘటన తిరుపతి జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అదుపుతప్పి చెరువులో కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా.. చెన్నైకు చెందిన కెప్టెన్ ప్రభాకర్, స్టీఫెన్ రాజ్, కమల్ రాజ్, దినేష్, మారుతి అనే ఐదుగురు స్నేహితులు శనివారం సరదాగా విహారం కోసం కేవీబీపురం మండలంలోని ఆరే జలపాతానికి  వచ్చారు. 

జలపాతం వద్ద రాత్రంతా సరదాగా గడిపిన వీరు ఈరోజు సాయంత్రం తిరుగు ప్రయాణంలో చెన్నైకు  వెళుతుండగా.. శ్రీకాళహస్తి పిచ్చటూరు మార్గంలోని మిద్ది కండ్రిక వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న మారుతి, దినేష్, కమల్ రాజ్ కారుడోర్లు తెరుచుకుని ఒడ్డుకు చేరారు.

కెప్టెన్ ప్రభాకర్, స్టీఫెన్ రాజ్ కారులోంచి బయటకు రాలేక కారులోనే ప్రాణాలు విడిచారు. సమాచారం తెలుసుకున్న కేవీ పురం పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారును ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also read: Watch Video: బాకెట్ నిండా కింగ్ కోబ్రా పిల్లలను పట్టుకున్న స్నేక్ క్యాచర్..ఇంతకీ తల్లి పాము ఏం చేసిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News