Uttarakhand Road Accident: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

Bus Accident In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో గంగోత్రి జాతీయ రహదారిపై లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 27 మంది సురక్షితులయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 20, 2023, 11:08 PM IST
Uttarakhand Road Accident: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

Bus Accident In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగోత్రి జాతీయ రహదారిపై గంగ్నాని సమీపంలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో 27 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. గుజరాత్‌కు చెందిన బస్సు 34 మంది ప్రయాణికులతో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి వస్తున్న క్రమంలో గంగ్నాని సమీపంలో రోడ్డు మీద నుంచి 150 మీటర్ల దూరంలో నది వైపు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు.  మృతులంతా గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి ఉత్తరకాశీ ‌ఎస్పీ అర్పణ్ యాదవ్ చేరుకుని పరిశీలించారు. 

ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని.. ఈ బాధను భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గాయపడిన వారంటూ అందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉత్తరాఖండ్‌లోని లోయలో బస్సు పడిపోవడంతో గుజరాత్‌కు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన తనను బాధించిందన్నారు. ఘటనకు సంబంధించి అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని ఆయన తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
 
కాగా ఈ నెల 15న కూడా డెహ్రాడూన్ నుంచి ఉత్తరకాశీకి వస్తున్న ఓ బస్సు మౌరిమాన సమీపంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. మౌరియానా సమీపంలో బస్సు రోడ్డు కిందకు చెట్టును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది.

Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు  

Also Read: Etela Rajender: లంబాడా తల్లుల శీలాన్ని శంకిస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఫైర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News