Bigg Boss 4 Telugu Total Votes: బిగ్‌బాస్ 4 ఓట్లు రెట్టింపు.. టైటిల్ విన్నర్‌కు భారీ మెజార్టీ ఖాయం! 

Bigg Boss 4 Telugu Total Votes: 15 వారాల కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్‌ ప్రతి ఒక్కరూ విజేత అని చెప్పవచ్చు. కానీ టైటిల్ అందుకున్న వారే అసలైన విజేత అనే అభిప్రాయాలు ఉన్నాయి.

Last Updated : Dec 20, 2020, 07:36 PM IST
  • బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే ప్రారంభం
  • సెలబ్రిటీలు ఫినాలేకు గెస్ట్‌లుగా విచ్చేశారు
  • గత సీజన్ కన్నా రెట్టింపు ఓట్లు కంటెస్టెంట్స్ సొంతం
Bigg Boss 4 Telugu Total Votes: బిగ్‌బాస్ 4 ఓట్లు రెట్టింపు.. టైటిల్ విన్నర్‌కు భారీ మెజార్టీ ఖాయం! 

Bigg Boss 4 Telugu Total Votes: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 విజేత ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. 15 వారాల కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్స్‌ ప్రతి ఒక్కరూ విజేత అని చెప్పవచ్చు. కానీ టైటిల్ అందుకున్న వారే అసలైన విజేత అనే అభిప్రాయాలు ఉన్నాయి. కొద్దిసేపటి కిందట బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది.

డ్యాన్సులు, స్టెప్పులు, రంగులు, వెలుగులు, హంగులతో బిగ్‌బాస్ 4 (Bigg Boss Telugu 4) సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియో వెలిగిపోతోంది. హోస్ట్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. షోను ఉత్సాహంగా ప్రారంభించారు. ముందుగా అభిమానులలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు నాగార్జున. 

Also Read: Bigg Boss Telugu 4 Grand Finale: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడా! కథ వేరే ఉందా?

బిగ్‌బాస్ సీజన్ 3లో రాహుల్ విన్నర్ కాగా, శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే గత సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకు మొత్తం 8 కోట్ల ఓట్లు పోల్ కాగా, ప్రస్తుత సీజన్లో ఓట్లు రెట్టింపయ్యాయి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో విజేతను నిర్ణయించే ఫినాలే కోసం ఏకంగా 15 కోట్ల 65 లక్షల ఓట్లు పోల్ కావడం విశేషం. షో డబుల్ సక్సెస్ అయిందని నాగార్జున (Nagarjuna) పేర్కొన్నారు.
Also Read: Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!

కాగా, గత మూడు సీజన్లలో ఎంతగా ప్రయత్నించినా తమకు టైటిల్ దక్కలేదని, ఈసారి ఎలాగైన తమకే ట్రోఫీ లభిస్తుందని మహిళా ప్రేక్షకులు భావిస్తున్నారు. ఏ విధంగా చూసినా అభిజిత్ లేక సోహైల్ టైటిల్ నెగ్గుతారని, అరియానా రన్నరప్‌గా నిలిచే అవకాశాలు సైతం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. 

Also Read: Bigg Boss 4 Telugu Winner: హిస్టరీ రిపీట్ కానుందా.. అద్భుతం జరగనుందా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News