Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!

Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ! గురువారం రాత్రి వంద రోజుల బిగ్‌బాస్ 4 జర్నీ చూశాక అసలు కథ ప్రేక్షకులకు అర్థమైంది. తన సినిమాలకు ఆడియెన్స్ రాక షోలు కూడా వేయలేదని, ఇకనుంచి సీన్ మారుతుందని ఆశిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సోహైల్.

Last Updated : Dec 18, 2020, 02:52 PM IST
  • బిగ్‌బాస్‌లో 100 డేస్ చూపించారు
  • తన జర్నీ చూసిన సోహైల్ కంటతడి
  • ప్రేక్షకులను సైతం ఏడిపించేశాడు
Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!

Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 క్లైమాక్స్‌కు వచ్చేసింది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్‌కు వారు బిగ్ బాస్ 4 ఇంట్లో గడిపిన 100 రోజులు ఎలా ఉన్నారో చూపించారు. తన జర్నీని చూసుకుంటూ కంటెస్టెంట్ సోహైల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ప‌క్కింటి వ్యక్తిలా బిగ్‌బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి వెళ్లిన వ్యక్తి సోహైల్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ప్రతి ఇంట్లోనూ వ్యక్తిగా మారిపోయాడు. జర్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ 4 ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు సోహైల్.

ముందుగా తనకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు తెలిపాడు సోహైల్(Sohel). తనకు ఓట్లు వేసి గెలిపిస్తున్న ప్రేక్షకులకు సైతం కృత‌జ్ఞత‌లు తెలిపాడు. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా తనకు గుర్తింపు రాలేదని, కేవలం బిగ్ బాస్ 4 (Bigg Boss Telugu 4) షోతో వంద రోజుల్లో పేరు వచ్చిందన్నాడు సోహైల్. తనకు సినిమా తప్ప.. వేరే పని తెలియదన్నాడు.

Also Read: Vote for Abhijeet: సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ క్యాంపెయిన్.. ఉద్యమంలా ఓటింగ్

ఇప్పటివరకూ తన సినిమా టిక్కెట్ తానే కొనుక్కుని చూసేవాడినని ఇకనుంచి బిగ్ బాస్ ప్రేక్షకులు థియేటర్లకు తన సినిమా చూస్తారని ఆశిస్తున్నానంటూ ఏడ్చేశాడు.‘థియేటర్ ఇంకా మొత్తం ఖాళీగానే ఉందనే మాట చాలాసార్లు విన్నాను. అందుకు షో వేయలేకపోతున్నామని వినిపించేది. నాకు సినిమానే జీవితం. బిగ్ బాస్ 4లో అవకాశం రావడంతో పదేళ్ల కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నాను. నేను జాబ్, బిజినెస్ వంటివి అసలే చేయలేనంటూ’ మోకరిల్లి కన్నీటి పర్యంతమయ్యాడు సోహైల్.

Gallery: Payal Rajput Photos: నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫొటోస్

కథ వేరే ఉంటది అంటే.. ఏంటో అనుకున్నాం కానీ ఇది సోహైల్ అసలు కథ అంటూ బిగ్‌బాస్ తెలుగు4 ప్రేక్షకులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. సింగరేణి ముద్దబిడ్డకు ఓట్లు వేయాలంటే నేటి రాత్రి 12 గంటలవరకే అవకావం ఉందని తెలసిందే. 

Also Read: Worlds Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News