Jawan Movie: జవాన్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..: దీపికా

Jawan Movie: బాలీవుడ్ స్టార్ షారుఖ్ జవాన్ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తోంది. ఈ మూవీ వెయ్యి కోట్లు దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో గెస్ట్ రోల్ చేసిన దీపికా పదుకొనె రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాఫిక్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 04:52 PM IST
Jawan Movie: జవాన్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు..: దీపికా

Deepika Padukone remuneration: కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.650 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఈ బ్లాక్ బాస్టర్ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, దీపికా పదుకొనె, సంజయ్ దత్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించిన దీపికా ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారనే టాక్ నెట్టింట హాల్ చల్ చేస్తోంది. రూ.15 కోట్లు తీసుకున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.

తాజాగా దీనిపై స్పందించారు దీపికా. ఈ మూవీ కోసం తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. షారుఖ్ పై అభిమానంతో చేసానని చెప్పుకొచ్చింది.  దీపికా పదుకొణె,  షారుక్ ఖాన్ కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఇందులో ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’, పఠాన్ ఉన్నాయి.  ’83’ సినిమాలోనూ అతిథిపాత్రలో కనిపించినా దీపికా ఆ సినిమా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. జవాన్ సినిమాలో హీరోగా నటించిన షారుఖ్ కు రూ.100 కోట్లు, విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి రూ.20కోట్లు, హీరోయిన్ గా చేసిన నయనతారకు రూ.10 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

జవాన్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.  జవాన్ హిందీ వెర్షన్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుందని సమాచారం. ఈ మూవీ క్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also Read: Chandramukhi 2: వామ్మో.. ‘చంద్రముఖి 2’ రన్‌టైమ్‌ అన్ని గంటలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News