Kajal Agarwal: రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరం కానున్న కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal Movies: కాజల్ అగర్వాల్ కి తెలుగులో ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ మరో రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరం కాదండి అనే వార్త వినిపిస్తోంది.. ఇంతకీ కారణమేమిటంటే 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 21, 2024, 06:08 PM IST
Kajal Agarwal: రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరం కానున్న కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal break: దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో ప్రత్యేక పాపులారిటీ ఉంది. అంతేకాదు అన్ని ఇండస్ట్రీలకన్నా కూడా కాజల్ అగర్వాల్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 

ఐశ్వర్యారాయ్ క్యూ హోగయాన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి.. సినీ ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోయిన్…కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించింది ‌

అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా.. ఈ హీరోయిన్ కి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆ సినిమా తర్వాత నుంచి కాజల్ అగర్వాల్ కి అసలు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. 

కాగా ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. ప్రెగ్నెంట్ అయిన వెంటనే కొద్ది రోజులపాటు సినిమాలకు దూరంగా ఉండింది. కాగా కాజల్ మళ్లీ బాబు పుట్టిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని.. మళ్లీ ఈ మధ్యనే కొన్ని సినిమాలతో బిజీ అయింది. 

ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కాజల్ అగర్వాల్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బ్రేక్ తీసుకోని ఉంది అనే వార్త తెగ వినిపిస్తోంది. ఇంతకీ కారణం ఏమిటంటే కాజల్ అగర్వాల్ మళ్లీ ప్రెగ్నెంట్ అయిందట. ఈ నేపథ్యంలో మరో రెండు సంవత్సరాల పాటు కాజల్ సినిమాల్లో కనిపించకపోవచ్చు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Also Read: Bank Merger:  ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ  బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి

Also Read:PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News