PM Kisan 19th Installment: పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏటా రైతుల ఖాతాల్లోరూ.6000 జమా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే మూడు విడుతల్లో రూ.2000 విడుదల చేస్తోంది. అయితే, ఈ పథకం ద్వారా కూడా మీరు కూడా ఈ డబ్బులు పొందాలంటే వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ యోజన చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ నేపథ్యంలో వారు ప్రతి ఏటా రూ.6000 మూడు విడుతల్లో పొందుతున్నారు. అయితే, అక్టోబరల్ 5నే 18వ విడుత పీఎం కిసాన్ యోజన డబ్బులను విడుదల చేసింది.
ఈ పథకం ద్వారా రైతులు డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఖాతాల్లో డబ్బులు పొందుతారు. అయితే, ఈ పథకంలో డబ్బులు పొందాలంటే మీరు కచ్చితంగా మొబైల్ నంబర్‌తో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. సదరు మొబైల్ నంబర్ స్వీచాఫ్ ఉండకూడదు. యాక్టీవ్‌లో ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు కేవలం కేవైసీ పూర్తి చేసుకున్నవారికే అందుతాయి. ఇది కేవలం రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతుంది. కేవైసీ సమయంలో రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ సమయంలో కోడ్‌ను అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ మొబైల్ యాక్టీవ్‌గా ఉండాలి. స్వీచాఫ్ ఉండకూడదు.
ఇక పీఎం కిసాన్‌లో కేవైసీ పూర్తి చేయడానికి అధికారిక వెబ్‌సైట్ www.pmksan.gov.in ద్వారా చేసుకోవచ్చు. ఇందులో అప్డేట్ కేవైసీలో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు అక్కడ నమోదు చేయాలి. ఆ తర్వాతే మీకు ఓటీపీ వస్తుంది. దీన్ని కూడా ఎంటర్ చేయాలి.
ఇక పీఎం కిసాన్ డబ్బులు పొందే లబ్దిదారుల స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ నంబర్, రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే చెక్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 18 విడుత పీఎం కిసాన్ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బు జమా చేసింది. రైతులు 19వ విడుత డబ్బులకు ఎదురు చూస్తున్నారు. ఈ విడుత డబ్బులు 2025 ఫిబ్రవరిలో కేంద్రం జమా చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఇటీవలె కేంద్ర ప్రభుత్వం కేవలం సాగు చేస్తోన్న భూమి కలిగిన రైతులకు ఈ రైతు బంధు అందిస్తున్నట్లు. భూమి ఇతరుల పేరుపై ఉంటే సాగు చేస్తోన్న రైతులకు పీఎం కిసాన్ వర్తించదని చెప్పింది. ఈ విధానంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి భూమి ఎవరిపేరు పై ఉంటే వారికే పీఎం కిసాన్.