Bank Merger: ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి

Bank Merger:  ప్రాంతీయ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రక్రియను షురూ అయ్యింది. ఒక రాష్ట్రంలో ఒకే ఆర్ఆర్ బీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఆర్ఆర్ బీలకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చింది.   

Written by - Bhoomi | Last Updated : Dec 20, 2024, 09:34 AM IST
Bank Merger:  ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ  బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి

Bank Merger:  కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ..ఒక రాష్ట్రంలో ఒకే గ్రామీన బ్యాంకు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్నే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ నినాదంతో దీనిని తీసుకువచ్చింది. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణలో సమర్థత పెంచుతూ ఖర్చులన్నీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం..ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకే  3 దశలుగా ఈ విలీన ప్రక్రియ జరగ్గా..ఇప్పుడు నాలుగో విడత మొదలుపెట్టింది. 2025 జనవరి 1 నుంచే ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది. ఏపీ, తెలంగాణలో కూడా మొత్తం ఐదు గ్రామీణ బ్యాంకులు ఉన్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఇవి కూడా విలీనం కానున్నాయి. పెద్ద బ్యాంకులో విలీనం అవుతాయని చెప్పవచ్చు. తాజాగా ఈ విలీనానికి సంబంధించి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు కీలక ప్రకటన  చేసింది. బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ సహా తన ట్విట్టర్ హ్యాండిల్ లోనూ ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్, ముఖ్య గమనిక అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ప్రస్తుతం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు..రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుంది. ఇది కేవలం ఏపీకే పరిమితం కానుంది. తెలంగాణలోని APGVB శాఖలు అన్నీ..అక్కడి గ్రామీణ బ్యాంకు అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమైన కార్యకలాపాలను కొనసాగిస్తాయి. ఇక ఏపీజీవీబీ సేవలు ఏపీలో మాత్రమే కొనసాగుతాయని స్పష్టం తెలిపింది. ఏపీలో ఇదే పేరుతో కార్యకలాపాలు కొనసాగించున్నట్లు తెలిపింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. 

Also Read: YS Sharmila: వైఎస్‌ షర్మిల బర్త్‌ డే వేడుకల్లో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు

ఈ విలీన ప్రక్రియలో భాగంగా..తెలంగాణలోని మొత్తం 493 ఏపీజీవీబీ బ్రాంచులు తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో కలిపిపోనున్నాయి. ఏపీలోని 278 బ్రాంచులు, అదేపేరుతో ఏపీలో కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సహా ఏపీలోని తమ కస్టమర్లకు నోటీస్ రిలీజ్ చేసింది. ఈ రెండు బ్యాంకులు మధ్య ఇప్పుడు ఆస్తులు , అప్పులు విభజనకు లోబడి ఉంటాయి. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా..తెలంగాణలో తమ బ్రాంచులు అదే ప్రదేశంలో ఉంటాయని..ఏదైనా సమాచారం కోసం బ్యాంకులను సంప్రదించాలని కోరింది. 

ముఖ్యంగా బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఏర్పడే సాంకేతి సమస్యల కారణంగా డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే నాలుగు రోజుల పాటు అన్ని బ్రాంచుల్లో బ్యాంకింగ్ సేవలు సహా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. దీనిలో యూపీఐ, ఏటీఎం సర్వీసులు ఉన్నాయి. ఈ అసౌకర్యాన్ని తాము చింతిస్తున్నామని..కస్టమర్లు సహకరించి డిసెంబర్ 27లోపు బ్యాంకులో పనులను పూర్తి చేసుకోవాలని కోరింది. 

Also Read: Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టికి గ్రహాల గండం.. 'సంపర'లో పాప పరిహార పూజలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News