Karthika Deepam 2: దీప పొదుపు.. కార్తీక్‌కు కొండంత ధైర్యం, తండ్రికి బుద్ది లేదంటూ స్వప్న ఫైర్..

Karthika Deepam 2 Today December 25th Episode: కాంచన భర్తతో నా ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణంలోవచ్చి మాట వెనక్కి తీసుకోమన్నా.. ఊపిరి వదులుకుంటా కానీ, మాటను కాదు. నేను వదులుకుంది ఆస్తులు ధైర్యం కాదు. నాకొడుకే నాధైర్యం. నిజాయితీకి నిదర్శనం నా కోడలు దీప. ఇంక నేను దేనికి భయపడతాను అనుకున్నావ్‌. వచ్చిన దారిలోనే మీరు బయలుదేరొచ్చు అంటుంది కాంచన.

Written by - Renuka Godugu | Last Updated : Dec 25, 2024, 10:48 AM IST
Karthika Deepam 2: దీప పొదుపు.. కార్తీక్‌కు కొండంత ధైర్యం, తండ్రికి బుద్ది లేదంటూ స్వప్న ఫైర్..

Karthika Deepam 2 Today December 25th Episode: సాక్షాత్తు ఆ దేవేంద్రుడు వచ్చి వరాలు ఇచ్చినా వీరికి తీసుకోవడానికి తీరిక లేదు వీళ్లకి ఆ శివన్నారాయణే కరెక్ట్ అని కార్తీక్‌ నాన్న పిన్నిలు వెళ్లిపోతారు. దీప నువ్వు వచ్చి బెడ్రూమ్‌ సర్దు శౌర్యకు నిద్ర వస్తుంది అంటాడు కార్తీక్. మరోవైపు శివన్నారాయణ ఇంట్లో అందరూ డైనింగ్‌ టేబుల్‌ వద్ద తింటూ ఉంటారు. తిను సుమిత్ర అంటాడు దశరథ్‌. ఈ ఇంటి ఆడపడచు కష్టాల్లో ఉంటే ముద్ద నోట్లోకి ఎలా వెళ్తుంది అండి కట్టు బట్టలతో కుటుంబం అంతా రోడ్డు మీదకు వెళ్లారంటే అవేమి మనకు అవసరం లేదు మన కడుపు నిండితే చాలు.. నావల్ల కావడంలేదండి అని చేయి కడుక్కుని వెళ్లిపోతుంది సుమిత్ర. ఇక దశరథ్‌ కూడా అదే పనిచేస్తాడు. శివన్నారాయణ కూడా నాకు చాలు అని లేచి వెళ్లిపోతాడు.

ఇలా ఎన్నాళ్లు తినకుండా ఉంటారు. నువ్వు తినవే మనవరాళా.. అంటుంది గ్రానీ. బావ వెళ్లిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ, దీప కోసం వెళ్లిపోయాడు చూడు అది తట్టుకోలేక పోతున్నా అంటుంది జ్యోత్స్న. వారికి భోజనం ఎలా అంటుంది జో.. ఉంది కదా దీప నాకు తెలిసి ఇప్పటి అది ఉఫ్.. ఉఫ్ అని ఊదుతూ వంటలు చేస్తుంది లే.. అంటుంది పారిజాతం.

ఇక దీప ఇంటి వద్ద నిజంగానే అదే పనిలో పడుతుంది. కట్టెల పొయ్యిపై వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్‌ దిగాలుగా దీపనే చూస్తుంటాడు. సారీ దీప అంటాడు కార్తీక్‌. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత గొప్పగా చూడాలనుకున్నా, కానీ నేను చేయలేకపోయా అంటాడు కార్తీక్‌. నేను అనుభవిస్తుంది కష్టం కాదు.. మీది కష్టం అంటుంది దీప. రేపు ఉదయం వరకు బాబాయ్‌ పంపిస్తా అన్నాడు అంటుంది దీప.

రెండు రోజులు పోతే అవే సర్దుకుంటాయి అంటుంది దీప. తినడానికి సరుకులు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు. ఎవరీ దగ్గర డబ్బులు తీసుకోలేను. జాబ్ చూసుకుని అడ్వాన్స్‌ తీసుకున్నా కాస్త టైమ్‌ కావాలి. నాకోసం ఏ బాధలేదు. మీకోసమే అంటాడు. ఇప్పటికిప్పుడు ఈ బాధలు పోతాయంటే హ్యాపీనా అంటుంది దీప. ఏ పెరట్లో డబ్బుల చెట్టు ఏమైనా ఉందా? అంటాడు కార్తీక్‌. అప్పుడు డబ్బులు పెట్టే స్టీల్‌ డబ్బా తెచ్చి ఇస్తుంది దీప. ఇది గుర్తుందా? మీకు నేను ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇందులో వేశాను రూ.36 వేలు పైగా ఉన్నాయి. పెళ్లైన తర్వాత పని వదిలేశా.. లేకపోతే ఇంకా డబ్బులు అయ్యేవి అంటుంది దీప. కార్తీక్ కన్నీటిపర్యాంతమవుతూ ఈ డబ్బు నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయి తెలుసా? నువ్వు సొంత ఖర్చు కూడా చేయకపోతే చాదస్తం అనుకున్నా. ఈ డబ్బు తీసుకెళ్లి మీకు కాంచనమ్మగారికి దుస్తులు, సరుకులు తెండి సరిపోతాయి కదా అంటుంది.

ఇదీ చదవండి: రుద్రాణీ, ధాన్యలక్ష్మిల ఆకలి కేకలు.. తాతయ్యకు బిల్‌ కట్టలేని స్థితిలో కావ్యరాజ్‌లు..  

మళ్లీ నెల రోజుల వరకు మన ఖర్చులకు ఇబ్బంది లేదు. ముందు జాబ్‌ చూసుకుంటా అంటాడు. బిజినెస్ చేస్తా అన్నారు కదా అంటుంది. ముందు కుటుంబాన్ని పోషించాలి కదా.. సాధించాలి. నువ్వు ఇలా ధైర్యం ఇస్తూ ఉంటే నేను ఎందుకు సాధించను అంటాడు కార్తీక్‌.  వంట అవ్వగానే వచ్చి వడ్డిస్తా మీరు లోపలికి వెళ్లండి బాబు అంటుంది దీప. థ్యాంక్స్‌ దీప అని చెప్పి వెళతాడు కార్తీక్‌.

మరోవైపు దాసు దీప బాధల గురించి బాధపడుతుంటాడు. ఒకవేళ దీపే అసలు వారసురాలు అని చెబితే ఎంత న్యాయం జరుగుతుంది. క్షమించి చేరదీస్తాడా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దీపకు న్యాయం ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక స్వప్న డ్యాడీ.. నీకు కొంచెం అయినా బుద్ది ఉందా? అంటుంది.  లేదని చెప్పండి అంటుంది కావేరి. నువ్వు చెప్పు అన్నయ్య ఇంటికి వెళ్లావట. కష్టాల్లో ఉన్న కొడుకు వద్దకు వెళ్లి బేరాలు మాట్లాడతవా? అంటేంది. ఎస్‌ నా ఈగో కోసం అన్నాను. మీ వదిన, అన్న, పెద్దమ్మ, నీకు ఈగో లేదా? ఇంతమందికి ఈగో ఉండగా నాకు ఉంటే తప్పేంటి. నీలాంటి కూతురుని నేను ఎప్పటికైనా క్షమించను. హలో ఈరోజు మా అన్నయ్య బ్యాడ్‌ కాబట్టి మీలాంటి వారికి వాయిస్‌ వచ్చింది. అన్నిటికీ కౌంటర్‌ ఉంటుంది. జస్ట్‌ వెయిట్‌ అని స్వప్న ఫోన్‌ కట్‌ చేస్తుంది. అప్పుడే దాసు వచ్చి మాట్లాడతాడు. మా అన్నయ్య దగ్గరికి వెళ్లి డబ్బిస్తాను సారీ చెప్పు అన్నారట అని స్వప్న వెళ్లిపోతుంది.

ఇదీ చదవండి:  పీవీ సింధు రిసెప్షన్‌ ఫొటోలు.. హైదరాబాద్‌కు అతిరథ మహారథులు..  

చాప వేసుకుని నట్టింట్లో భోజనం కోసం వస్తారు అంతా. నాకు ఆకలి లేదు నేను తర్వాత తింట అంటుంది కాంచన. అయినా బలవంతంగా పెడతారు. ఈ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ ఇంట్లో మనం ఎందుకు వెళ్లాలి మనింటికి వెళ్లిపోదాం అంటుంది శౌర్య.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News