Super Queen Season 2 Promo: ఏనుగు.. పంది అంటూ ట్రోల్స్.. కంటతడి పెట్టిన కమెడియన్ విద్యుల్లేఖ

Trolls on Vidyullekha Raman : లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్‌ శరీరాకృతిపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా సూపర్ క్వీన్ అనే షోలో విద్యుల్లేఖ రామన్‌ కనిపించనుంది. అయితే ఈ ప్రారంభ కార్యక్రమంలో విద్యుల్లేఖ చేసిన కామెంట్లు అందరినీ కదిలిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2023, 06:33 PM IST
  • లేడీ కమెడియన్‌కు చేదు అనుభవం
  • ట్రోలింగ్‌పై స్పందించిన విద్యుల్లేఖ
  • ఏనుగు, పంది అంటూ విమర్శలు
Super Queen Season 2 Promo: ఏనుగు.. పంది అంటూ ట్రోల్స్.. కంటతడి పెట్టిన కమెడియన్ విద్యుల్లేఖ

Super Queen Season 2 Promo: బుల్లితెరపై జీ తెలుగు చేసే షోలు ఎంతో హిట్ అవుతుంటాయి. ఇక ప్రదీప్ షోలు అంటే జీ తెలుగులో ఎంతో ఆదరణను దక్కించుకుంటాయి. ప్రదీప్ హోస్ట్‌గా చేసిన సూపర్ క్వీన్ షో ఫస్ట్ సీజన్ బాగానే హిట్ అయింది. ఇప్పుడు రెండో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ రెండో సీజన్‌లో బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా తారలు వచ్చారు. ఇందులో ముఖ్యంగా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, కండక్టర్ ఝాన్సీ, సింగర్ మౌనిక యాదవ్‌లు హైలెట్ అయ్యారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్‌ గెస్ట్‌గా వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఈ షోలో విద్యుల్లేఖ రామన్, కండక్టర్ ఝాన్సీలు కన్నీరు పెట్టేసుకున్నారు. సామీ సామీ పాటను పాడి ఫేమస్ అయిన మౌనికా యాదవ్ తన ఫ్యామిలీని స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. తమ కోసం తమ తండ్రి ఎంతలా కష్టపడ్డాడో చెప్పి అందరినీ ఎమోషనల్‌ చేసింది.

ఇక కండక్టర్ ఝాన్సీ విషయంలో అయితే తమ నాన్న పూర్తిగా వదిలేస్తే.. అమ్మ పెంచిందని చెబుతూ ఏడ్చేసింది. ఇది ఓవర్ నైట్ స్టార్డం కాదని, ఎన్నో ఏళ్ల కష్టమని చెప్పుకొచ్చింది. లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఈ షోకు తన భర్తను తీసుకొచ్చినట్టుంది. తన మీద జరిగిన ట్రోలింగ్, బాడీ షేమింగ్ మీద స్పందించి ఎమోషనల్ అయింది.

Also Read:  Akhil Akkineni Birthday : అఖిల్ బర్త్ డే.. ఇంకా కష్టపడుతున్న అక్కినేని హీరో.. అన్నీ అందని ద్రాక్షలానే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News