Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్‌ను ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఆస్కార్ సాధించామని ఎన్టీఆర్ వేసిన ట్వీట్ మీద కాజల్ స్పందించింది. భీమ్ మన ప్రతిష్ట పెంచాడంటూ కాజల్ స్పందించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 12:50 PM IST
  • ఆస్కార్ సాధించడంపై ఎన్టీఆర్ ట్వీట్
  • భీమ్ పాత్రపై కాజల్ రియాక్షన్
  • ఆడుకుంటోన్న మెగా ఫ్యాన్స్
Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్‌ను ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?

Mega Fans Trolls Kajal Aggarwal: సోషల్ మీడియాలో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. రామ్ చరణ్‌ గ్రేట్ అంటే ఎన్టీఆర్ గ్రేట్ అంటూ ఇరువురి హీరోల అభిమానులు తన్నుకు చస్తున్నారు. ఆస్కార్ ఈవెంట్లో మా వాడు హైలెట్ అయ్యాడంటే.. మా వాడు హైలెట్ అయ్యాడంటూ తన్నుకు చస్తున్నారు. ఈ ఆస్కార్ అవార్డ్ విషయంలో క్రెడిట్ మాదంటే మాదంటూ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. రామ్ పాత్రే హైలెట్ అయిందని మెగా ఫ్యాన్స్, భీం పాత్రే హైలెట్ అయిందని నందమూరి అభిమానులు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.

బన్నీ వేసిన ట్వీట్ ఎంత రచ్చకు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్‌ని కేవలం లవ్లీ బ్రదర్ అన్నాడు.. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రైడ్ అని పొగిడేశాడు. దీంతో బన్నీని మెగా ఫ్యాన్స్ తిట్టేస్తున్నారు. ఇప్పుడు కాజల్‌ను కూడా ఆడేసుకుంటున్నారు. కాజల్ సైతం ఎన్టీఆర్ ట్వీట్‌కు స్పందించింది. భీం పాత్రతో గౌరవాన్ని తీసుకొచ్చావ్ అన్నట్టుగా కాజల్ ట్వీట్ వేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

దీంతో కాజల్‌ను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం కాజల్, రామ్ చరణ్‌లు మంచి ఫ్రెండ్స్ అని ఇలా ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటూ పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. కాజల్, రామ్ చరణ్‌ల మధ్య ఎంత మంచి స్నేహం ఉందో చెప్పే వీడియోలను వదులుతున్నారు. రామ్ చరణ్‌ కాజల్ కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

మగధీరతో వీరి కెరీర్‌లు పీక్స్‌కు చేరాయి. ఆ తరువాత గోవిందుడు అందరివాడేలే, నాయక్ వంటి సినిమాల్లోనూ కలిసి నటించారు. ఇక కాజల్ అయితే.. మెగా హీరోయిన్‌ అనే ట్యాగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ ఇలా మెగా కాంపౌండ్ హీరోలందరితోనూ నటించి మెగా హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే.

Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే

Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News