Nagarjuna: హ్యాండ్ఇచ్చిన చిరంజీవి…మరోసారి నాగార్జునవైపే మొగ్గుచూపిస్తున్న అక్కినేని కాంపౌండ్ దర్శకుడు

Kalyan Krishna: టాలీవుడ్ లో డైరెక్టర్లకి కొదవలేదు .కొందరు తమ సినిమాలతో సూపర్ సూపర్ సక్సెస్ అందుకుంటుంటే.. మరికొందరు చేతుల సినిమాలు లేక తట పటాయిస్తున్నారు. అలా డైలమాలో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. మరి ఇంతకీ అతని సమస్య ఏమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 12:24 PM IST
Nagarjuna: హ్యాండ్ఇచ్చిన చిరంజీవి…మరోసారి నాగార్జునవైపే మొగ్గుచూపిస్తున్న అక్కినేని కాంపౌండ్ దర్శకుడు

Chiranjeevi: కళ్యాణ్ కృష్ణ కురసాల.. మంత్రి కురసాల కన్నబాబు సోదరుడిగా..టాలీవుడ్ దర్శకుడిగా.. అతనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. టాలీవుడ్ లో డైరెక్టర్ గా అతను తెరకెక్కించిన మొదటి సినిమా సోగ్గాడే చిన్నినాయన. నాగార్జునకు మంచి సక్సెస్ అందించిన ఈ చిత్రం ..సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం.. అంటూ థియేటర్లలో తెగ సందడి చేశాడు ఈ డైరెక్టర్.

అయితే అతను తీసిన మూడవ చిత్రం నేల టికెట్టు కాస్త తేడా కొట్టింది. దీంతో బాగా అచ్చొచ్చిన తండ్రి కొడుకుల్ని ఇద్దరినీ కలిపి.. బంగార్రాజు మూవీ ని దింపాడు. మరీ రికార్డు సృష్టించకపోయినా.. డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఇతని సినిమాల్లో కామన్ గా ఉండే పాయింట్ మొదట్లో ఈ సినిమాల షూటింగ్లు అన్నీ కూడా కథ వల్ల ఆలస్యం అవ్వడం.. లేదా షూటింగ్ మధ్యలో జాప్యం జరగడం లాంటివి జరిగాయి .

నేల టికెట్టు బోల్తా కొట్టిన తర్వాత బంగార్రాజు మూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది .పోనీ బంగార్రాజు పూర్తయ్యాక నెక్స్ట్ మూవీ అన్న మొదలయ్యిందా అంటే దాని పరిస్థితి అంతంత మాత్రమే మిగిలింది. బంగార్రాజు మూవీ తర్వాత కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ తో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. నీకు స్టోరీ నచ్చడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది స్టోరీ పట్టాలెక్కడమే లేట్ అనుకునే సమయానికి చిత్రం ఒక రీమేక్ అన్న ప్రచారం జోరుగా సాగింది.

భోళా శంకర్ సినిమాతో బోల్తా కొట్టిన చిరు మళ్ళీ ఇంకొక రీమేక్ చేయాలి అంటే ఆలోచనలు పడ్డాడు. దీంతో అతని సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. సంవత్సరం నుంచి చిరంజీవి కోసం ఎదురుచూస్తున్న ఫలితం లేకపోయింది. చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డిసెంబర్ కన్ఫామ్ చేయడంతో అఫీషియల్ గా కళ్యాణ్ మూవీ రద్దు అయినట్టు క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకుంటాడు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. తనకు బాగా అచ్చొచ్చిన గ్రాండ్ ఫాదర్ లాంటి నాగార్జున చెంత చేరుతాడా లేదా అనేది చూడాలి. సంక్రాంతి బరిలో సత్తా చాటిన నా సామి రంగ సక్సెస్ తరువాత తన నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో బంగార్రాజు ఫ్రాంచైజ్ ని దింపాలి అనుకుంటున్న ఈ దర్శకుడికి నాగార్జున ఆప్షన్ ఇస్తారా లేదా మరోసారి నా సామిరంగా దర్శకుడు తోనే సినిమా తీసి వచ్చే సంక్రాంతికి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Also read: RGV on Poonam Pandey: నీ వల్లే దేశమంతా చర్చ, నువు చేసింది తప్పు కాదు

Also Read: IND vs ENG 2nd Test: బుమ్రా దెబ్బకు కుదేలైన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News