IND vs ENG 2nd Test: బుమ్రా దెబ్బకు కుదేలైన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్ బుమ్రా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 171 పరుగులకు ఆధిక్యం లభించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 07:32 PM IST
IND vs ENG 2nd Test: బుమ్రా దెబ్బకు కుదేలైన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

IND vs ENG 2nd Test Day 2 Highlighits: వైజాగ్ టెస్టులో భారత్ స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. తొలి రోజు బ్యాటర్లు చెలరేగితే.. రెండో రోజు బౌలర్లు విజృంభించారు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఆరు వికెట్ల (6/45)తో సత్తా చాటాడు. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు (3/71) పడగొట్టాడు. దీంతో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్‌ జాక్‌ క్రాలే (78 బంతుల్లో 76, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కెప్టెన్ స్టోక్స్‌ 47 పరుగులతో సత్తా చాటాడు. తొలి టెస్టు సెంచరీ హీరో ఓలీ పోప్‌ 23 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (17 బంతుల్లో 15 బ్యాటింగ్‌, 3 ఫోర్లు), రోహిత్‌ శర్మ (13 బంతుల్లో 13 నాటౌట్‌, 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో భారత్‌ ఆధిక్యం ఓవరాల్‌గా 171 పరుగులకు ఆధిక్యం లభించింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్‌ (17 బంతుల్లో 15 బ్యాటింగ్‌, 3 ఫోర్లు), రోహిత్‌ శర్మ (13 బంతుల్లో 13 నాటౌట్‌, 3 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆట మరో మూడు రోజులు మిగిలున్న నేపథ్యంలో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆదివారం భారత్ ఎలా ఆడుతుందన్న దానిపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

Also Read: IND vs ENG 2nd Test: రేర్ ఫీట్ సాధించిన అండర్సన్.. 72 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన లెజండరీ పేసర్..

Also Read: IND vs ENG 2nd Test Live: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి.. మూడో భారత బ్యాటర్‌గా ఘనత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News