Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణం అనంతరం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలనే మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్.. తాజాగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.

Last Updated : Oct 25, 2020, 01:24 PM IST
Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

pawan kalyan's 30th Movie with sagar k chandra direction: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణం అనంతరం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీ బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. అయితే తన జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తర్వాత చేయబోయే మరో మూడు చిత్రాలను సైతం ప్రకటించారు. అందులో మొదటిది క్రిష్‌తో ( Director Krish ) కాగా.. రెండోది గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో ( Director Harish Shankar ), మూడో చిత్రం కిక్, రేసుగుర్రం, సైరా నర్సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ( Director Surender Reddy ) దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా పర్వదినం సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులకు మరో పండుగ లాంటి వార్త బయటకు వచ్చింది. ఇప్పటివరకు వరుసగా 27, 28, 29 సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్.. తాజాగా 30వ సినిమాకు కూడా కమిట్ అయ్యారు. ఆ మూవీ గురించి సమాచారమిస్తూ.. ఆదివారం అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు మూవీ మేకర్స్.

ఈ మేరకు మూవీ మేకర్స్.. పవన్ కల్యాణ్ 30వ సినిమా వివరాలను ప్రకటిస్తూ.. కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (sitara entertainments) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్. 12గా సాగర్‌ కె.చంద్ర (Sagar Chandra) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ వీడియోలో పవన్ ఇమేజ్ రెట్టింపు చేసేలా.. కింగ్ ఆఫ్‌ ఆట్టిట్యూడ్‌... తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మీ ముందుకు రాబోతున్నారు.. అంటూ చూపించారు మూవీ మేకర్స్. అయితే ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నారు. 

కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న అయ్యపనమ్ కోషియం ( Ayyapanum Koshiyum ) అనే మలయాళ చిత్రానికి ఇది పవన్ 30 వ సినిమా రీమేక్‌గా తెరకెక్కనుంది.  ఈ చిత్రంలో ప‌వ‌న్ కల్యాణ్ మరోసారి పోలీస్ రోల్‌లో క‌నిపించ‌నుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  

Also read: Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News