Pithapuram Temples: దక్షిణ కాశీ.. శక్తిపీఠం.. పురుహుతికా అమ్మవారి దేవాలయం! ఒకప్పుడు ఆధ్యాత్మిక విశిష్టతకు నిలయమైన కాకినాడ జిల్లా పిఠాపురం.. నేడు దేశవ్యాప్తంగా సరికొత్త వెలుగులతో మార్మోగిపోతోంది! దానికి కారణం.. అక్కడి ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్! పిఠాపురం రాజవంశీకుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఈ నియోజకవర్గాన్ని కేవలం రాజకీయనగరంగానే కాదు.. భారతదేశంలోనే అగ్రగామి ‘టెంపుల్ టూరిజం సర్క్యూట్’గా తీర్చిదిద్దేందుకు సమరశంఖం పూరించారు. గడపలోనూ భక్తి పారవశ్యం నింపేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. పిఠాపురం ఆధ్యాత్మిక వైభవంపై జీ తెలుగు న్యూస్ స్పెషల్.
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించి బలమైన వాదనలు వినిపించింది. రాష్ట్రంలో సమకాలీన, శాస్త్రీయ డేటాను ప్రాతిపదికగా తీసుకునే పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 33.33 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశామని ఏపీ సర్కార్ న్యాయస్థానానికి నివేదించింది.
Political Movie Celebrities Condemns Singeetham Death: భారత దేశం గర్వించే దర్శకుల్లో సింగీతం శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసినట్టైయింది. తుది శ్వాస వరకు సినిమానే శ్వాసగా, ధ్యాసగా బతికిన ఈ లెజండరీ దర్శకుడు మృతిపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల ద్వారా తమ సంతాపం తెలియజేస్తున్నారు.
AP MLC Naga Babu Tonsured In Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగేంద్ర బాబు తలనీలాలు సమర్పించుకున్నారు. తన మనవడికి తిరుమలలో పుట్టువెంట్రుకలు తీయించగా.. నాగబాబు కూడా గుండు చేయించుకున్నారు. అనంతరం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులతోపాటు నిహారిక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
AP Global Horticulture Hub Launch: రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన రైతులకు కొండంత అండగా నిలుస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రూ.1 లక్ష కోట్ల భారీ అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చారిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ పూర్వోదయ పథకం కింద రూ.40,352 కోట్ల ప్రభుత్వ నిధులు, మిగిలిన రూ.60,000 కోట్లను ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా సాధించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.