Rajendra Prasad about Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 సినిమా గురించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరో అనే పదానికి కొత్త అర్థం లభిస్తోంది" అంటూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా సినిమాలలో హీరోల క్యారెక్టర్రైజేషన్ క్రమంగా మారిపోతోందని.. చెప్పిన రాజేంద్రప్రసాద్, నెగిటివ్ పాత్రలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా హరికథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.." ఇప్పటి కథలకి కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. వాడెవడో చందనం దుంగల దొంగ. వాడు హీరో" అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పై తెలిపినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు.
ఇందులో పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఈ పాత్రకు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా లభించింది. అప్పట్లో దీనిపై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవ్వడంతో చాలామంది రాజేంద్రప్రసాద్ మాటలపై ట్రోల్స్ చేశారు.. ముఖ్యంగా ఒక స్టార్ హీరోని పట్టుకొని రాజేంద్రప్రసాద్ ఇలా కామెంట్ చేయడం ఏమాత్రం సవ్యంగా లేదని ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ కి ఈ విషయంపై ఒక ప్రశ్న ఎదురయింది. ఇటీవల పుష్ప గురించి మాట్లాడినప్పుడు అది ఎందుకు ట్రోల్ చేశారు? అని ప్రశ్నించగా.. దీనిపై క్లారిటీ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "నేను మొన్న అల్లు అర్జున్ ని కలిసినప్పుడు అల్లు అర్జున్ నాతో మీరు ఆ మాట అనలేదు కదా.. అని అడిగాడు. పిచ్చోడా నేనే ఆ మాట అన్నాను అంటూ అన్నాను. అయినా మీరు అన్నది ఆ ఉద్దేశం కాదు కదా అని అడిగాడు. నిజమే నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు. అయితే నేను కూడా ఆ ఉద్దేశంతో అనలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా మారిపోయిందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా నెగిటివ్గా చూపిస్తున్నారు. దీంతో ఒకడిని గట్టిగా పట్టుకొని అడిగాను. దానికి వాడు అన్న టైటిల్ అలా పెట్టకపోతే ఎవరు చూడరు అని నాతో చెప్పాడు. చూడడం కోసం టైటిల్ అలా పెట్టి నాపై నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కదా అని నేను నవ్వుకున్నాను. అందులో మ్యాటర్ ఏం ఉండదు కాకపోతే టైటిల్ లోని నెగిటివ్ ఉంటుంది అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. నేను ఎప్పుడు ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడాలని అనుకోను. అంటూ రాజేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: KT Rama Rao: మోసాన్ని కప్పిపుచ్చడానికే ఏసీబీ విచారణ డ్రామా: కేటీఆర్
Also Read: Rajinikanth: కంట్రోల్ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.