Sailesh Kolanu: సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడని అభిమాని ఇంటికి తెలుగు డైరెక్టర్.. అసలు ఏమైందంటే?

Sailesh Kolanu Surprise Visit to Fan's Home: హిట్, హిట్ 2 సినిమాల దర్శకుడు తన అభిమానికి షాక్ ఇచ్చాడు. తాను హైదరాబాద్ బైక్ లో వెళుతున్నానని కామెంట్ పెట్టిన క్రమంలో ఒక అభిమాని ఇంటికి ఆహ్వానించగా వెంటనే వారి ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చాడు.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 07:39 AM IST
Sailesh Kolanu: సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడని అభిమాని ఇంటికి తెలుగు డైరెక్టర్.. అసలు ఏమైందంటే?

Sailesh Kolanu Breakfast at Fan's House: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాసుకున్న కథలతోనే హీరో నానిని మెప్పించి దర్శకుడిగా సెటిలైపోయాడు శైలేష్ కొలను. మంచి చదువు చదువుకుని ఎక్కడో విదేశాల్లో జాబ్ చేస్తున్న శైలేష్ కొలను ఒక మంచి కథ రాసుకొని హీరో నానిని కలవగా ఆయన హిట్ అనే సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. అలా మొదటి భాగం విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కించిన శైలేష్ కొలను సూపర్ హిట్ అందుకున్నాడు.

దానికి సీక్వెల్ గా హిట్ రెండో భాగం కూడా చేసి దాంతో కూడా హిట్ అందుకున్నాడు. అడవి శేషు హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ హిట్ పరంపరలోనే అనేక సినిమాలు వస్తాయని శైలేష్ కొలను చెబుతున్నాడు. హిట్ మూడవ భాగంలో నాని హీరోగా నటిస్తున్నట్టుగా హిట్ రెండో భాగం చివరిలో క్లారిటీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా హిట్ మూడవ సినిమా కంటే ముందే వెంకటేష్ తో సైంధవ్ అనే సినిమా సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also Read: Chiranjeevi vs Rajini: చిరుని ఢీ కొట్టనున్న రజనీకాంత్..మరో రెండు సినిమాలు కూడా?

అయితే ఈ దర్శకుడు తాజాగా చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ఈ దర్శకుడు స్వయంగా బైక్ రైడ్ చేస్తూ కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక అభిమాని సరదాగా మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళమని మెసేజ్ చేశాడట. అయితే ఎప్పుడూ హోటల్స్ కి వెళ్లి ఏం తింటాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ శైలేష్ కొలను సదరు వ్యక్తి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

అక్కడికి వెళ్లాక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేశాడు. అ కుర్రాడితో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఇతని పేరు పవన్ అని కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతున్నాను అనే విషయం తెలిసి తన ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి ఆహ్వానించాడని చెప్పుకొచ్చాడు. తాను కూడా సర్ప్రైజ్ ఇస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళానని వాళ్లది భలే లవ్లీ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చాడు శైలేష్. పవన్ అమ్మ పునుగులు తినిపించారని అవి చాలా బాగున్నాయి అని అన్నారు.

అంతేకాక ఆమె వెంకీ మామకు ఫ్యాన్ అని తెలిసి మరింత ఆనందపడ్డానని తాను తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తానని ఆమె అన్నారని తనకు చాలా ఆనందంగా అనిపించిందని ఈ సందర్భంగా శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. ఇక సైలేష్ కొలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Also Read: Sharwanand Marriage: ఎంగేజ్మెంట్ అయిన నాలుగు నెలలకు కూడా శర్వానంద్ పెళ్లి ఎందుకు అవ్వలేదు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News