Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!

Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 15, 2024, 09:21 AM IST
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!

Kanguva release date:
సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీయడం కంటే కూడా వాటిని కరెక్ట్ టైంలో విడుదల చేయడం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే అగ్ర హీరోల సినిమాలు విడుదల చేయాలి అంటే డేట్ల విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. సూర్య నటిస్తున్న కంగువ మూవీ పరిస్థితి కూడా ఇదే అని అనిపిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు. 2024లో విడుదలవుతుంది అని పోస్టర్ మీద పేర్కొన్నారు తప్ప ఎప్పుడూ అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Sivakumar (@actorsuriya)

ప్రస్తుతం దీని వెనుక ఉన్న రీజన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. నిజానికి 2024లో పెద్ద సినిమాలు చాలా విడుదల కి సిద్ధంగా ఉన్నాయి. మేలో విడుదల కావలసిన ప్రభాస్ కల్కి చిత్రం ఎలక్షన్స్ కారణంగా జూన్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ చిత్రం విడుదల డేట్ గురించి స్పష్టంగా తెలియదు. మరోపక్క జూన్ లో విడుదలకు కమల్ హాసన్ భారతీయుడు2 కూడా సిద్ధంగా ఉంది. శంకర్ మోస్ట్ ప్రిస్టేజెస్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఆ తర్వాత ఆగస్టులో బాక్స్ ఆఫీస్ రికార్డులనే తిరగ రాసిన పుష్ప 2 మూవీ విడుదల అవుతుంది. సెప్టెంబర్ లో నాని సరిపోదా శనివారం తో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్య అవకాశం ఉంది. ఈ అక్టోబర్ లో బాక్స ఆఫీస్ మీద దండయాత్రకి దేవర వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ మూవీ కావడంతో దీనిపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క అదే నెలలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇప్పటికే నువ్వా నేనా అంటూ తెలుగు చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటే.. బయట నుంచి వచ్చే డబ్బింగ్ చిత్రాల హడావిడి ఉండనే ఉంది.

విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం , రజనీకాంత్ వెట్టాయన్ చిత్రాలు కూడా మరొక రెండు మూడు నెలల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకి టాలీవుడ్ లో మార్కెట్ బాగా ఉంది. కాబట్టి వీళ్ళ సినిమాలను కూడా అంత తక్కువగా తీసుకోలేము. ఈ నేపథ్యంలో సూర్య మూవీ ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయం పెద్ద సవాలుగా మారింది. సూర్యకి మాత్రం కంగువ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలి అని ఆశ ఉందట. కానీ 205 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభరతో పాటు బాలయ్య మూవీ కూడా బరిలోకి దిగే ఆస్కారం ఉంది. కాబట్టి అప్పుడు కుదరదు. 

అందుకే ప్రస్తుతానికి కంగువ చిత్రబంధం డేట్ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. ఉన్న సినిమాలలో ఏదో ఒకటి వెనక్కి వెళ్తే.. ఆ టైమ్ ను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని వెంటనే కంగువ మూవీ విడుదల చేసే ఆలోచనలో చిత్ర బంధం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు తప్ప రిలీజ్ డేట్ గురించి ఎక్కడ ఇవ్వలేదు. ఇక కంగువ చిత్రం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో గతానికి ,వర్తమానానికి మధ్య సాగే కథ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. ఈ జోనర్ లో చాలా సినిమాలే వచ్చాయి.. కానీ ఇందులో సూర్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడు.  కోలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీపై అంచనాలు భారీ గా ఉన్నాయి.

Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..

Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News