KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది

KA Paul Prajashanti Party Symbol: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. హెలికాప్టర్‌ గుర్తును కాకుండా 'మట్టికుండ'ను ప్రకటించింది. ఈ విషయాన్ని పాల్‌ స్వయంగా తెలిపాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 12, 2024, 10:33 PM IST
KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది

KA Paul Party Symbol: రాజకీయాల్లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ వ్యవహారం ట్రెండింగ్‌లో ఉండే అంశం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రాజకీయ వ్యవహారాలు జోరుగా సాగుతుంటే అక్కడ వాలిపోయి కొన్నాళ్లు రచ్చ చేసే నాయకుడు పాల్‌. అలాంటి కేఏ పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ఉన్న హెలికాప్టర్‌ను ఈసీ తొలగించి కొత్త గుర్తును కేటాయించింది. ఆ గుర్తు చాలా ఆసక్తికరంగా ఉంది.

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌

పార్టీ గుర్తు మారిన విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ స్వయంగా ప్రకటించాడు. విశాఖపట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడారు. హెలికాప్టర్ గుర్తు స్థానంలో మట్టి కుండను కేటాయించినట్లు పాల్ తెలిపారు. 'కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే నేను కూడా ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతా' అని ప్రకటించాడె. అనంతరం స్వయంగా మట్టి కుండ తయారు చేశారు. ప్రజలకు కుటుంబ పాలన వద్దని.. కుండ పాలన కావాలని పేర్కొన్నారు.

Also Read: BJP Candidate Viral Photo: ఎంపీ అభ్యర్థి అత్యుత్సాహం.. ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు

ఈ సందర్భంగా పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల గుర్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. 'ఫ్యాన్లకు ఉరివేసుకుని చనిపోతున్నారు. గ్లాసులు పగిపోయాయి. సైకిళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మట్టి కుండతో ఎలాంటి ప్రమాదం లేదు' అని ప్రత్యర్థి పార్టీల గుర్తులను ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ, కేసీఆర్‌, జగన్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు 'ప్రజాశాంతి పార్టీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలి' అని కోరారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని తెలిపారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కేఏ పాల్‌ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్టణం నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తాను ఆపానని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ గుర్తు మట్టికుండ విశేషాలు వివరించారు. 'కుండ జీవం ఇస్తుంది. సత్యాన్ని, మంచిని ఇస్తుంది. కుండ గుర్తు కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేశా. మన విజయానికి కుండ గుర్తు రావడమే నిదర్శనం' అని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News