Agnipath Recruitment 2022: అగ్నివీర్ నావికా దళంలో 20 శాతం మహిళల నియామకం

Agnipath Recruitment 2022: దేశవ్యాప్తంగా వివాదం రేపిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నావికాదళం తొలిబ్యాచ్‌లో 20 శాతం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 5, 2022, 05:40 PM IST
 Agnipath Recruitment 2022: అగ్నివీర్ నావికా దళంలో 20 శాతం మహిళల నియామకం

Agnipath Recruitment 2022: దేశవ్యాప్తంగా వివాదం రేపిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నావికాదళం తొలిబ్యాచ్‌లో 20 శాతం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అగ్నిపథ్ పథకంలో భాగంగా నావికాదళంలో భర్తీ కోసం అగ్నివీర్‌ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో 20 శాతం మహిళలకు ప్రాధాన్యత ఉండనుంది. అగ్నివీర్ తొలి బ్యాచ్‌లో 20 శాతం మహిళల్ని నియమిస్తామని నేవీ అధికారి ఒకరు తెలిపారు. 20 శాతం మహిళల్ని విభిన్న విభాగాలు, విభిన్న శాఖలకు కేటాయిస్తామన్నారు. భారతీయ నావికాదళం ఈ ఏడాది అగ్నిపథ్ పథకం ద్వారా తొలిసారి మహిళా నావికుల్ని నియమించనుంది. తొలిబ్యాచ్‌లో మూడు వేల అగ్నివీర్లను నియమిస్తుంది. నావికాదళంలో పాల్గొనే అగ్నివీర్‌లు నవంబర్ 21లోగా ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో ఎంపిక కావల్సి ఉంటుంది. 

ప్రస్తుతం 30 మంది మహిళా అధికారిణులు పదోన్నతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. నావికాదళంలోని అన్ని విభాగాల్లో మహిళల నియామకం జరుగుతుంది. సముద్రంలో కూడా మహిళా అగ్నివీర్‌ల నియామకం జరగనుంది.1990 నుంచే ఇండియన్ నేవీలో మహిళల నియామక ప్రక్రియ జరుగుతుంది. కానీ అధికారికంగా మహిళల నియామక ప్రక్రియ 2019-20 నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ట్యాంకర్‌పై ఇద్దరేసి మహిళా అధికారిణులను నియమించారు. 

జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి లాంచ్ చేశారు. దీనికింద..ఆర్మీలో చేరాలని ఆసక్తి కలిగిన యువతీ యువకులను భర్తీ చేయనున్నారు. ఈ పధకం కింద భర్తీ అయ్యేవారిని అగ్నివీర్‌లుగా పిలుస్తారు. నాలుగేళ్ల అనంతరం..75 శాతంమందికి సెటిల్‌మెంట్ ఇచ్చి పంపించేస్తారు. మిగిలిన 25 శాతమందిని కొనసాగిస్తారు. అగ్నివీర్‌ల జీతం 30 నుంచి 40 వేలవరకూ ఉంటుంది.

Also read: Apple iPhone 13: రూ.79 వేలు విలువ చేసే ఐఫోన్ 13ని చౌక ధరకే సొంతం చేసుకునే ఛాన్స్.. ఎలాగో తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News