Dear Uma: మల్టీ టాలెంటెడ్ సుమయ రెడ్డి.. త్వరలోనే ‘డియర్ ఉమ’ రిలీజ్

Dear Uma Movie Updates: సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించిన మూవీ డియర్ ఉమ. సుమయ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా.. కథ కూడా అందించారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2024, 03:54 PM IST
Dear Uma: మల్టీ టాలెంటెడ్ సుమయ రెడ్డి.. త్వరలోనే ‘డియర్ ఉమ’ రిలీజ్

Dear Uma Movie Updates: ఓ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యహరించడం ఒక ఎత్తు అయితే.. కథను కూడా అందించడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఇలా మల్టీ టాలెంటెడ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు సుమయ రెడ్డి. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానరన్‌పై డియర్ ఉమ అనే మూవీ త్వరలోనే ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ సినిమాలో సుమయ రెడ్డి, దియ మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జోడిగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సుమయ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు లేటెస్ట్ అప్‌డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు చక్కని సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో డియర్ ఉమ మూవీని ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కూడా నిర్మించారని పేర్కొన్నారు. టీజర్ విడుదల అయిన తరువాత సినిమా స్థాయి ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. ప్రేమ, కుటుంబం, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుందని.. త్వరలోనే థియేటర్లోకి రానుందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. 

డియర్ ఉమ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. కెమెరామెన్‌గా రాజ్ తోట వ్యవహరించగా.. కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

సాంకేతిక బృందం

==> బ్యానర్: సుమ చిత్ర ఆర్ట్స్
==> ప్రొడ్యూసర్: సుమయ రెడ్డి
==> డైరెక్టర్: సాయి రాజేష్ మహాదేవ్
==> సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
==> మ్యూజిక్: రధన్
==> ఎడిటర్: సత్య గిడుతూరి
==> PRO: సాయి సతీష్

Also Read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News