Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


Happy Kanuma Wishes In Telugu 2024: తెలుగు రాష్ట్రాలలో కనుమ పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది..పండగను రైతుల పండుగగా భావిస్తారు.. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పండగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ..కనుమ పండుగ శుభాకాంక్షలు మీ మిత్రులకు తెలియజేయండి.

 

Kanuma Wishes In Telugu 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి..ఈ పండుగను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతికి ముందు రోజు భోగి పండగను జరుపుకుంటే.. ఆ తర్వాతి రోజు కనుమ పండగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు పశువులను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పంట చేతికి రావడం వెనుక ఉన్న పశువుల కృషిని గుర్తించి ఈరోజు వాటిని పూజించి పిండివంటలు ఆహారంగా ఇస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు కనుమ పండగ శుభాకాంక్షలను తెలియజేయండి.

1 /9

కనుమ పండగ రోజు ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా సంతోషంగా కుటుంబంతో గడపాలని పాత జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటూ ఆనందంగా ఉండాలని మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.

2 /9

కనుమ, భోగి మంటలు మీ జీవితానికి ఆనందం శ్రేయస్సు సంతోషాన్ని అందించాలని ఆ శ్రీమహావిష్ణువుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కనుమ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు..

3 /9

కనుమ పండుగను ఎంతో ఉత్సాహంగా, రైతులతో ఆనందంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ.. ప్రతి రైతుకి కనుమ పండుగ శుభాకాంక్షలు.

4 /9

వ్యవసాయానికి రైతులకు తోడుగా ఉండే ప్రతి పశువుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసే పండగే కనుమ..ఇలాంటి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని కోరుకుంటూ కనుమ పండగ శుభాకాంక్షలు.

5 /9

రైతు లేని రాజ్యం లేదు..పశువులు లేని పంటలు లేవు..రైతులకు, తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కనుమ శుభాకాంక్షలు.  

6 /9

వ్యవసాయంలో రైతులకు తోడుగా ఉండే పశువు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ కనుమ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.

7 /9

కనుమ పండగ మాత్రమే కాదు.. పశువులను రైతు కష్టాల గుర్తించి ఇచ్చే కానుక ఈ పండగ.. కాబట్టి మనమంతా ఎల్లప్పుడూ జరుపుకోవాలని కనుమ పండుగ..

8 /9

సంవత్సరం పొడవునా రైతుల కష్టాలను పంచుకునే పశువులను అందరూ గుర్తించి..కనుమ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని.. ఎల్లప్పుడు రైతు కష్టాలతోనే కాకుండా సుఖసంతోషాలతో కూడా ఉండాలని కోరుకుంటూ.. అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.

9 /9

ప్రతి రైతు జీవితాంతం సంతోషం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.