ప్రముఖ సినీ దర్శకుడి అనుమానాస్పద మృతి

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సి శివకుమార్ మృతి

Last Updated : Aug 3, 2018, 07:18 PM IST
ప్రముఖ సినీ దర్శకుడి అనుమానాస్పద మృతి

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు సి శివకుమార్ గురువారం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగుచూసింది. చెన్నైలోని విరుగంబక్కంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోని శివ కుమార్ నివాసంలోంచి శుక్రవారం దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శివ కుమార్ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అతడు శవమై కనిపించినట్టు తెలుస్తోంది. ఇంట్లో టీవీ నడుస్తుండటం, శవం పడి ఉన్న తీరు, అక్కడ దుర్వాసన తీవ్రతను పరిశీలించిన పోలీసులు.. అతడు గురువారం రాత్రే టీవీ చూస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.

శివకుమార్ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివ కుమార్ మృతికి దారితీసిన కారణాలపై ఓ ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతే అతడి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమాచారం. అజిత్, అర్జున్ లాంటి అగ్రహీరోలతో సినిమాలు చేసిన శివకుమార్ మృతిపై నడిగర్ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. 

Trending News