పాక్ జిందాబాద్ నినాదాల ఎఫెక్ట్: కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా

సిద్ధు, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Last Updated : Dec 7, 2018, 08:37 AM IST
పాక్ జిందాబాద్ నినాదాల ఎఫెక్ట్: కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డ అమిత్ షా

సిద్ధూ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ నిదానాదాల అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్ధూతో పాటు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. ఈ దేశంలో ఒక బాధ్యతయుతమైన పౌరుడిగా ఉన్న సిద్ధు పాక్ ను వెనకేసురాడం ఏంటని ప్రశ్నించారు.

పాక్ ఆర్మీ చీఫ్ ను హగ్ చేసుకోవడం వల్ల ఆయనకు పాక్ జాతీయతపై అభిమానం వచ్చి ఉండవచ్చని అమిత్ షా ఎద్దేవ చేశారు. ఏది ఏమైనా దేశ పరుకు భంగం కలించేలా సిద్ధు.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. దీనికి దేశ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అమిత్ షా పేర్కొన్నారు. సిద్ధు ర్యాలీ అంశం, ఆయన పాక్ పై చూపిస్తున్న అభిమానంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించాలని ఈ సందర్భంగా అమిత షా డిమాండ్ చేశారు.

రేపు రాజస్థాన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సిద్ధు.. శనివారం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెయని వ్యక్తులు పాక్ కు అనుకూల నినాదాలు చేశారు. దీన్ని సిద్ధు ఖండించకపోగా చిరునవ్వుచిందించారు. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.  ఈ నేపథ్యంలో స్పందించిన బీజేపీ చీఫ్ అమిత్ షా..సిద్ధూ, కాంగ్రెస్ పై ఇలా విరుచుకుపడ్డారు

Trending News