Aadhaar Update: రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా..? ఇదిగో ఈజీ మార్గం

One Nation One Ration Card: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరిగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 02:16 PM IST
Aadhaar Update: రేషన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా..? ఇదిగో ఈజీ మార్గం

One Nation One Ration Card: ఓవైపు నకిలీ రేషన్ కార్డులు తొలగిస్తూ.. మరోవైపు వన్ నేషన్-వన్ రేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింక్ చేసుకోవాలని వినియోగదారులను కోరుతోంది. దేశంలోని లక్షలాది మంది రేషన్ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. రేషన్ కార్డు కింద ఆహార ధాన్యాలతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఆధార్ కార్డును రేషన్ కార్డుతో లింక్ చేయడం ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా రేషన్ దుకాణం నుంచి రేషన్ పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ను రేషన్ కార్డుతో ఇలా లింక్ చేయండి

  •  ముందుగా అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in లోకి వెళ్లండి.
  •  'Start Now' పై క్లిక్ చేయండి.
  •  ఇక్కడ మీరు మీ చిరునామాను నింపాలి.
  •  ఆ తరువాత 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  •  ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఇ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ ఎంట్రీ చేయండి. 
  •  ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  •  ఇక్కడ OTPని ఎంటర్ చేసిన తరువాత.. స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయిన సందేశం వస్తుంది.
  •  ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే.. మీ ఆధార్‌తో రేషన్ కార్డుతో మీ ఆధార్ లింక్ చేసినట్లు మెసేజ్ వస్తుంది.

ఆఫ్‌లైన్‌లో ఇలా..

రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును ఆఫ్‌లైన్‌లో కూడా లింక్ చేసుకోచ్చు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, రేషన్ కార్డ్ హోల్డర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ సెంటర్‌లో సమర్పించాలి. రేషన్ డీలర్ వాటిని పై అధికారులకు పంపించి.. ఆధార్‌తో రేషన్ కార్డుతో లింక్ చేయిస్తారు. 

Also Read: Justice DY Chandrachud: తండ్రి బాటలో తనయుడు.. జస్టిస్ చంద్రచూడ్‌లో ఉన్న ప్రత్యేకతలు ఇవే..  

Also Read: Rohit Sharma: సెమీస్‌కు ముందు ఆ ప్లేయర్‌కు బిగ్ రిలీఫ్.. రోహిత్ శర్మ సపోర్ట్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

 

Trending News