Tamilnadu: 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమిళ అసెంబ్లీలో బీజేపీ ఎంట్రీ

Tamilnadu: దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది. అన్నాడీఎంకేతో కలిసి ఎట్టకేలకు తమిళ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2021, 02:32 PM IST
Tamilnadu:  20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమిళ అసెంబ్లీలో బీజేపీ ఎంట్రీ

Tamilnadu: దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది. అన్నాడీఎంకేతో కలిసి ఎట్టకేలకు తమిళ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, ఒడిషాలలో ఏదో ఓ సమయంలో లేదా ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కానీ సుదీర్ఘకాలంగా దాదాపుగా రెండు దశాబ్దాలుగా బీజేపీకు చోటివ్వని రాష్ట్రం తమిళనాడు(Tamilnadu). తమిళనాడు అసెంబ్లీ(Tamilnadu Assembly) లో ఎంట్రీ ఇవ్వాలనే కమలనాధుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) పార్టీతో జతకట్టి పోటీ చేసింది. 20 స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడు అసెంబ్లీ(Tamilnadu Assembly) లో అడుగుపెట్టాలనే కోరికను నెరవేర్చుకుంది. 

జయలలిత (Jayalalitha) మరణం,శశికళ (Sasikala) జైలుకెళ్లడం తరవాత జరిగిన పరిణామాల్లో తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ మాత్రమే కాపాడుతూ వచ్చింది. తమిళనాట కమలం ముద్రవేసేందుకు చేసిన విశ్వ ప్రయత్నాల్లో ఇదొకటి. అటు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు బీజేపీ(BJP) అగ్రనేతలు చెప్పినట్టే చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు స్వయంగా తమిళనాడులో ప్రచారం చేశారు. ఇటీవల బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఖుష్బూ అయితే నేరుగా పోటీ చేశారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా వాస్తవానికి 60 సీట్లను టార్గెట్ చేసింది బీజేపీ. కానీ చివరికి 20 సీట్లకు ఒప్పందమైంది. ఇంతకుముందు అంటే వాజ్‌పేయి ( Vajpayee) ప్రదానిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 2 సీట్లు గెల్చుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు అంటే 20 ఏళ్ల తరువాత అదే పార్టీతో పొత్తుతో ఈసారి నాలుగు స్థానాలు గెల్చుకుంది. 

Also read: Mamata Banerjee: మమతా బెనర్జీ పోటీ చేసేంది ఆ స్థానం నుంచేనా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News