Mamata Banerjee: మమతా బెనర్జీ పోటీ చేసేంది ఆ స్థానం నుంచేనా..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో దీదీ వరుసగా మూడవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన బెంగాల్ ఫలితం టీఎంసీకు వన్‌సైడ్ అయింది. మరిప్పుడు దీదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 3, 2021, 01:04 PM IST
Mamata Banerjee: మమతా బెనర్జీ పోటీ చేసేంది ఆ స్థానం నుంచేనా..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో దీదీ వరుసగా మూడవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన బెంగాల్ ఫలితం టీఎంసీకు వన్‌సైడ్ అయింది. మరిప్పుడు దీదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు(West Bengal Election Results)వెలువడ్డాయి. అనూహ్యంగా మమతా బెనర్జీ మూడవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా భారీ మెజార్టీతో. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగుర వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన బీజేపీ (Bjp) కేవలం 75 సీట్లకే పరిమితమవ్వాల్సివచ్చింది. మూడవ సారి అధికారం సాధించిన మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో హోరాహోరీ పోరులో ఓటమి పాలయ్యారు. దాంతో ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

మమతా బెనర్జీ (Mamata Banerjee) పోటీ చేసేందుకు రాష్ట్రంలో మూడు స్థానాల్లో అవకాశముంది. రాష్ట్రంలో మండలి లేకపోవడంతో విధిగా ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావల్సిఉంది. రాష్ట్రంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహ్ స్థానంలో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీన ఇక్కడ పోలింగ్ జరిగింది. టీఎంసీ( TMC) విజయం సాధించినా..అభ్యర్ధి ఇటీవల మరణించారు. మరోవైపు ఆర్ఎస్పీ అభ్యర్ధి మరణం కారణంగా జంగీపూర్(Jangipur), కాంగ్రెస్ అభ్యర్ధి మరణం కారణంగా శంషేర్ గంజ్(Shamsher gunj)ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఖర్దాహ్ నుంచి ఇప్పటికే టీఎంసీ విజయం సాధించింది కాబట్టి..అది సురక్షితమైన స్థానంగా ఉంటుంది. అయితే జంగీపూర్, శంషేర్ గంజ్‌ల నుంచి పోటీ చేసి గెలిస్తే అదనంగా మరో స్థానం పార్టీ ఖాతాలో కలుస్తుందనే వాదన విన్పిస్తుంది. దీదీకు పట్టుదల ఎక్కువ కాబట్టి...ఖర్దాహ్(Khardah) కంటే.జంగీపూర్, శంషేర్ గంజ్‌లలో ఒకటి ఎంచుకునే అవకాశాలున్నాయి.

Also read: India Corona Crisis: 2 కోట్లకు చేరువలో కరోనా కేసులు, వరుసగా ఆరవ రోజు కూడా 3 వేలకు పైగా మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News