Close shave for Air India flight : రన్‌వేపై విమానానికి అడ్డంగా ఎదురొచ్చిన జీపు!

ఎయిర్ ఇండియా విమానానికి శనివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన A321 ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపైకొచ్చి టేకాఫ్ తీసుకునే సమయంలోనే.. ఉన్నట్టుండి అదే రన్ వే పైకి మరో జీపు దూసుకురావడం పైలట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

Last Updated : Feb 15, 2020, 07:59 PM IST
Close shave for Air India flight : రన్‌వేపై విమానానికి అడ్డంగా ఎదురొచ్చిన జీపు!

పూణె: ఎయిర్ ఇండియా విమానానికి శనివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన A321 ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపైకొచ్చి టేకాఫ్ తీసుకునే సమయంలోనే.. ఉన్నట్టుండి అదే రన్ వే పైకి మరో జీపు దూసుకురావడం పైలట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సరిగ్గా విమానానికి ఎదురుగా జీపు రావడాన్ని గుర్తించిన పైలట్.. వెంటనే కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించి విమానాశ్రయం భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని విమానాశ్రయం అధికారవర్గాలు.. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యాయి. అయితే, అదృష్టవశాత్తుగా ఈ ఘటన కారణంగా ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. విమానంలో ఉన్న 180 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని విమానాశ్రయం అధికారవర్గాలు తెలిపాయి.

పూణె విమానాశ్రయంలో కలకలం రేపిన ఈ ఘటనపై విమానాశ్రయం అధికారవర్గాలు విచారణకు ఆదేశించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News